• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • INDIA USA MILITARY DRILL IN KERALA FOR TWO DAYS AND INDIA USA GAVE STRONG WARNING FOR CHINA NGS

India-USA: డ్రాగెన్ కు వార్నింగ్.. భారత్- అమెరికా కలిస్తే ఇదీ సత్తా.. అదుర్స్ అనిపిస్తున్న యుద్ధ విన్యాసాలు

డ్రాగన్ కు భారత్ అమెరికా వార్నింగ్

భారత్ - అమెరికాలు ప్రత్యర్థి చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి.. భారత్ వేదికగా జరిగిన సంయుక్త యుద్ధ విన్యాసాల ద్వారా తమ బలం ఏంటో తెలిసేలా చేశాయి.

  • Share this:
    భారత్- అమెరికా కలిస్తే ప్రత్యర్థి దేశాల్లో వణుకు మొదలైనట్టే.. రెండు దేశాల దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి. శత్రువులు ఎక్కడి నుంచి దాడి చేసినా పిసగట్టే సమార్ధ్యం గల యుద్ద విమనాలు ఉన్నాయి. తాజాగా హిందూ మహాసముద్రంలో రెండు రోజుల పాటు జరుగుతున్న భారత్​-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాలకు చెందిన యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు హిందూ మహా సముద్రంలో జరిగిన విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే ఈ ప్రాంతంలో చైనా ఆగడాలకు చెక్​పెట్టేందుకు ఈ విన్యాసాలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంయుక్త విన్యాసాలు ద్వారా రెండు దేశాలలు.. దాయాది దేశమైన డ్రాగెన్ కు స్పష్టమైన సంకేతాలు పంపింది.

    అణ్వాయుధ సామర్థ్యంగల విమాన వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్‌ నేతృత్వంలో నావల్ కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌ను అమెరికా మోహరించింది. వీటితో పాటు ఎఫ్-18 యుద్ధ విమానాలు, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలయ్యే ఈ-2సీ హాక్ఐ విమానాలను కూడా విన్యాసాల కోసం అమెరికా మోహరించింది.

    ఇదీ చదవండి: వ్యాక్సిన్ వేసుకున్నారా? ఇక్కడ మీకు ఆఫర్లున్నాయ్.. ఫ్లైట్ నుంచి ఫుడ్ వరకు.. డిస్కౌంట్ ఎంతంటే?

    నిమిట్జ్ క్లాస్ విమాన వాహక నౌక రొనాల్డ్ రీగన్, ఆర్లీగ్ బుర్కే క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ హాల్సీ, టికొండెరొగ క్లాస్ గైడెడ్ మిసైల్ క్రూయిజర్ యూఎస్ఎస్ షిలోహ్ అమెరికా కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌లో ఉన్నాయి. విమాన వాహక నౌక, పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్స్, ఇతర నౌకలతో కూడిన భారీ నావికా దళాన్ని కేరియర్ బ్యాటిల్ గ్రూప్ లేదా కేరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. యుద్ద నౌకలను, మర్చంట్ మెరైన్ నౌకలను కాపాడే యుద్ధ నౌకలను ఫ్రిగేట్స్ అంటారు. జలాంతర్గాములు, విమానాల నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే, వేగంగా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లు అంటారు.

    ఇదీ చదవండి: భారత్ తో ఆ దేశం చేపల బేరం?.. వ్యాక్సిన్ ఇస్తేనే పులస చేపలిస్తాం?

    భారత్ కూడా తమ ఆయుధ బలగాలను ప్రదర్శనలో ఉంచింది. భారత్ మోహరించిన వాటిలో జాగ్వార్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్​ చేసే ఐఎల్-78 యుధ్ధ విమానం, అవాక్స్ (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) విమానాలు ఉన్నాయి. వీటితోపాటు పీ8ఐ సముద్ర నిఘా విమానాలను, మిగ్29కే యుద్ధ విమానాలను మోహరించింది. ఐఎన్​ఎస్​ కోచి, ఐఎన్​ఎస్​ టెగ్​ యద్ధనౌకలను భారత్ మోహరించింది.

    కేరళలోని తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటం సహా సముద్రతీర ప్రాంతాల్లో సమగ్ర సమన్వయం కోసం చేపట్టిన విన్యాసాలు నేడు కూడా కొనసాగనున్నాయి. భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, భారత వాయు సేనకు చెందిన యుద్ధ విమానాలు.. అమెరికాకు చెందిన కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌తో కలిసి భారత్ సంయుక్తంగా విన్యాసాల్లో పాల్గొందది. అయితే తొలి రోజు విన్యాసాలతో చిరకల దాయాది దేశాలు పాకిస్థాన్, చైనాలకు వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది..
    Published by:Nagesh Paina
    First published: