కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లను అంగీక‌రించండి.. ఈయూ దేశాల‌ను కోరిన కేంద్రం.. లేక‌పోతే..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం) (Image source: Reuters)

యూరోపియ‌న్ యూనియ‌న్‌ Green Passport scheme కింద ప్ర‌యాణికులపై ఆంక్ష‌లను స‌డ‌లించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి డిజిటల్‌ కొవిడ్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారు.

 • Share this:
  యూరోపియ‌న్ యూనియ‌న్‌ Green Passport scheme కింద ప్ర‌యాణికులపై ఆంక్ష‌లను స‌డ‌లించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సభ్యదేశాల మధ్య ప్రయాణించేవారికి డిజిటల్‌ కొవిడ్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌కు స్థానం లేకపోవడంపై భారతీయులు కలవరం చెందుతున్నారు. భార‌తీయులు అత్య‌ధికంగా తీసుకుంటున్న కొవిషీల్డ్‌కు సైతం ఈయూ ఆమోదిత జాబితాలో చోటుద‌క్క‌క‌పోవ‌డం.. భారతీయులు చిక్కులు ఎదుర్కొంటార‌నే చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌ని సీరం సంస్థ కోరింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. ఇండియాలో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

  త‌క్ష‌ణ‌మే కోవాగ్జిన్‌, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ల‌కు అనుమ‌తించాల‌ని కేంద్రం ఈయూ దేశాల‌ను కోరింది. లేక‌పోతే ఈయూ స‌భ్య దేశాల నుంచి భార‌త్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని తెలిపింది. అంతేకాకుండా క‌ఠిన‌మైన క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించింది. త‌మ వ్యాక్సిన్ల‌కు ఆమోదిత జాబితాలో చోటు క‌ల్పిస్తే.. క్వారంటైన్‌ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది.

  కోవిషీల్డ్‌, కొవాగ్జిన్ టీకాలను తీసుకున్న వారు చూపించే డిజిటల్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈయూకు స్పష్టం చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక‌, యూరోపియన్ యూనియన్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్ ఏజన్సీ(European Medicines Agency
  ) అనుమతించిన టీకాలను తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వాటిల్లో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, జాన్సస్ టీకాలు ఉన్నాయి.
  Published by:Sumanth Kanukula
  First published: