హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Tik Tok Ban | అమెరికాలోనూ టిక్ టాక్ బ్యాన్ చేయండి..ట్రంప్‌కు వినతి

Tik Tok Ban | అమెరికాలోనూ టిక్ టాక్ బ్యాన్ చేయండి..ట్రంప్‌కు వినతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు లేఖరాశారు.

Tik Tok Ban: టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐతే భారత్ నిర్ణయంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమెరికా మాత్రం ప్రశంసలు కురిపిస్తోంది. ఇప్పటికే భారత్ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోపియో పాంపియో సమర్థించారు. తాజాగా అమెరికాలోనూ టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలన్న డిమాండ్ బలంపుంజుకుంటోంది.   దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్ టాక్ సహా పలు చైనా యాప్స్‌ను బ్యాన్ చేస్తూ భారత్ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుందని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అభినందించారు. అమెరికా పౌరుల సమాచారాన్ని కూడా టిక్ టాక్, ఇతర యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయని కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపించారు. చైనా యాప్స్‌ని అస్సలు నమ్మలేమని.. ఆ యాప్స్ ద్వారా అమెరికాలో చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం చేస్తోందని విమర్శించారు.

దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని అమెరికాలో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని  కోరుతూ 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు లేఖ రాశారు. టిక్ టాక్‌ను బ్యాన్ చేయడం ద్వారా చైనా కమ్యూనిస్ట్ పార్టీ గూఢచర్యాన్ని అడ్డుకోవాలని తమ లేఖలో వారు కోరారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందించారన్నది ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ సహా చైనీస్ యాప్స్ ‌ను అమెరికా బ్యాన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

First published:

Tags: America, Donald trump, Tik tok, Tiktok

ఉత్తమ కథలు