ఉగ్రవాద ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ఐరాస యాక్షన్ ప్లాన్.. స్వాగతించిన భారత్

ఐరాస తీసుకున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) నిర్ణయం ద్వారా 50కి పైగా దేశాలు ఉగ్రవాద ఆర్థిక సహాయ సహకారాలకు సంబంధించి కఠినమైన చట్టాలను తీసుకురావడానికి అవకాశం ఏర్పడిందని అక్బరుద్దీన్ అన్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 11:37 AM IST
ఉగ్రవాద ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ఐరాస యాక్షన్ ప్లాన్.. స్వాగతించిన భారత్
ఐరాసలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఫైల్ ఫోటో (Image : Twitter)
news18-telugu
Updated: March 29, 2019, 11:37 AM IST
ఉగ్రవాద ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంలో భాగంగా ఐరాస కౌన్సిల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాకారం అందించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ చట్టాలను రూపొందించాలని ఆయా దేశాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనలు అందించిన ఫ్రెంచ్ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించే దేశాలపై ఆంక్షలు విధించడం, అలాగే ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్న నెట్‌వర్క్‌లను గుర్తించేందుకు ఇంటలిజెన్స్ యూనిట్స్‌ను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు.తాజా తీర్మానాన్ని ఐరాస చాప్టర్ 7లో పొందుపరిచింది. దీని ప్రకారం ఉగ్ర సంస్థలకు సహకారం అందించే దేశాలపై ఆంక్షలు విధించవచ్చు. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై చర్యలకు చాలాకాలంగా అంతర్జాతీయంగా ఒత్తిడి తెస్తున్న భారత్.. ఐరాస తాజా నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే పక్కా ఆచరణ ద్వారానే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని తెలిపింది.

ఉగ్రవాద ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి ఐరాస తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైల్ స్టోన్ లాంటిది. అయితే ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త పంథా అనుసరిస్తూనే ఉన్నారు. దానికి తోడు కొన్ని దేశాలు ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాయి.
సయ్యద్ అక్బరుద్దీన్, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి


ఐరాస తీసుకున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) నిర్ణయం ద్వారా 50కి పైగా దేశాలు ఉగ్రవాద ఆర్థిక సహాయ సహకారాలకు సంబంధించి కఠినమైన చట్టాలను తీసుకురావడానికి అవకాశం ఏర్పడిందని అక్బరుద్దీన్ అన్నారు. వరుస ఉగ్ర నేరాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇలాంటి చట్టాలే సరైనవి అన్నట్టుగా పేర్కొన్నారు.

First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...