INDIA STRONGLY OBJECTS AS WHO CLAIMS MORE INDIANS DIED OF COVID 19 THAN ACCOUNTED PVN
Covid Deaths : కరోనాతో ఎక్కువగా చనిపోయింది భారతీయులే..WHO తాజా రిపోర్ట్ లో సంచలన విషయాలు!
ప్రతీకాత్మక చిత్రం
India Objects WHO Report :ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలకు సంబంధించి అధికారిక గణాంకాలు తప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు నమోదైంది భారత్ లోనేనని డబ్యూహెచ్ వో తన తాజా రిపోర్ట్ ద్వారా వెల్లడించింది.
WHO Report On Covid Deaths : ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలకు సంబంధించి అధికారిక గణాంకాలు తప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు నమోదైంది భారత్ లోనేనని డబ్యూహెచ్ వో(World Health Organization) తన తాజా రిపోర్ట్ ద్వారా వెల్లడించింది. 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు భారత్ లో 47 లక్షల కరోనా మరణాలు(Covid Deaths) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. కాగా, ఈ కాలంలో దేశంలో సుమారు 5,20,000 కరోనా మరణాలు నమోదైనట్లు అధికార గణాంకాల ప్రకారం తెలుస్తోంది. భారత్‌లో కరోనా మృతుల్లో(India Covid Deaths) దాదాపు సగం మరణాలు రిపోర్ట్ చేయలేదని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న కోవిడ్ మరణాల్లో మూడొంతులు ఒక్క భారతదేశంలోనే జరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ప్రపంచంలో చోటు చేసుకున్న మొత్తం మరణాల్లో 80 శాతం ఒక్క భారత్‌లోనే జరిగినట్లు ఈ డేటా చెబుతోంది. కానీ 2020,2021ల్లో భారత్ లో 4.80 లక్షల్లోపే కరోనా మృతులు సంభవించాయని కేంద్రం రిపోర్ట్ చేసింది.గతేడాది మే-జూన్ మధ్య కరోనా సెకండ్ వేవ్‌లో 4.7 మిలియన్ల మంది మృతి చెంది ఉంటారని WHO అంచనా వేసింది.
మరోవైపు, కొవిడ్ బారిన పడటం సహా ఆరోగ్య రంగంపై ప్రభావం కారణంగా 2020 జనవరి నుంచి గతేడాది ఆఖరి వరకూ ప్రపంచవ్యాప్తంగా 1.33 కోట్ల నుంచి 1.66 కోట్ల మంది వరకూ మరణించి ఉండొచ్చని డబ్యూహెచ్ వో అంచనా వేసింది. అయితే అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య దాదాపు 63లక్షలు మాత్రమే ఉంది. అయితే ఈ లెక్కలు తప్పని డబ్యూహెచ్ వో రిపోర్ట్ చెబుతోంది. దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. ఆగ్నేయ ఆసియా, ఐరోపా, అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించాయని పేర్కొంది. ఈ గణాంకాలు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి మహమ్మారులు తలెత్తితే ఎలా ఎదుర్కొవాలనే విషయంలో ఉపయోగపడతాయని పేర్కొంది.కరోనా రోగులతో ఆస్పత్రులు నిండుకోవటంతో వివిధ జబ్బులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్ కు దూరమైనట్లు డబ్యూహెచ్ వో శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ గణిత నమూనా ప్రకారం ఈ లెక్కలు వేశారని ప్రశ్నించింది. ఈ సంఖ్యకు వాస్తవ సంఖ్యకు చాలా తేడా ఉన్నదని తెలిపింది. దేశంలో జనన, మరణాల నమోదుకు అత్యంత బలమైన వ్యవస్థ ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో డేటా సేకరణ వ్యవస్థను ప్రశ్నించింది. అసంబద్ధంగా ఉన్న ఈ గణాంకాల శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం చేసింది. తాజాగా విడుదల చేసిన డేటా, అనుసరించిన విధానాల విషయాన్ని ఆరోగ్య సంస్థ అసెంబ్లీ సహా సంబంధిత వేదికలపై లేవనెత్తనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.