హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia India: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. తటస్ఠంగా ఉంటున్న భారత్.. అక్కడ కూడా అదే వైఖరి

Russia India: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. తటస్ఠంగా ఉంటున్న భారత్.. అక్కడ కూడా అదే వైఖరి

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ చాలా దౌత్యంగా వ్యవహరిస్తోందనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది.

  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య భారత్ మరోసారి తన బలమైన విదేశాంగ విధానాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై ఓటింగ్ జరగాల్సిన తీర్మానాన్ని రష్యా సమర్పించింది. కానీ ఈ తీర్మానం ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. తటస్థంగా ఉండిపోయింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి.. భారత్‌ (India) మొదటి నుంచి న్యాయమైన, తటస్థ విధానాన్ని అవలంబిస్తోంది. అమెరికా(America) సహా పశ్చిమ దేశాలన్నీ రష్యాను విమర్శించాలంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చినా... భారత్ మాత్రం తటస్థంగానే ఉంది.

  ఐరాసలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరగ్గా.. 13 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. సిరియా, ఉత్తర కొరియా, బెలారస్‌లకు మద్దతుగా రష్యా ప్రతిపాదన చేసినా.. అది కుదరలేదు. దీన్ని ఆమోదించేందుకు రష్యాకు 9 ఓట్లు అవసరం కాగా.. రష్యా(Russia) ప్రతిపాదనకు చైనా కూడా మద్దతిచ్చింది. మరోవైపు భారత్‌తో పాటు భద్రతా మండలిలోని ఇతర సభ్యులు ఇందులో పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రతిపాదనలో ఏముందన్న అతిపెద్ద ప్రశ్న తలెత్తుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పౌరులందరికీ భద్రత కల్పించాలని.. రష్యా-ఉక్రెయిన్ మధ్య సమస్యను రాజకీయ చర్చలు, మధ్యవర్తిత్వం, ఇతర శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ రష్యా ప్రతిపాదన ముగింపుకు చేరుకోలేదు.

  మరోవైపు రష్యా ప్రతిపాదనపై అమెరికా కొరడా ఝుళిపించింది.ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ రష్యా ప్రతిపాదనపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభం కోసం రష్యా చేసిన ప్రతిపాదనపై భద్రతా మండలిలోని 13 మంది సభ్యులు ఓటు వేయలేదు. రష్యా యుద్ధం చేసిందని .. దాడి చేసిందని లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ అన్నారు. ఉక్రెయిన్‌లో ప్రజలపై అకృత్యాలకు రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుందని తెలిపారు. ఇప్పుడు వారి క్రూరత్వాన్ని కూడా అంగీకరించని ఆ తీర్మానాన్ని మనం ఆమోదించాలని రష్యా కోరుతోందని ఆరోపించారు. ఇది చాలా బాధ్యతారహితమైన చర్యగా అభివర్ణించారు.

  Putin Family: పుతిన్ ఫ్యామిలీపైనా వార్ ఎఫెక్ట్.. భర్త నుంచి విడిపోయిన పుతిన్ కూతురు.. బిజినెస్ ప్లాన్‌పై ప్రభావం

  Russia-Ukraine War: యుద్ధంలో ఎవరిది గెలుపు.. రష్యా తదుపరి చర్య ఇదేనా..?

  వీటన్నింటి మధ్య రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ చాలా దౌత్యంగా వ్యవహరిస్తోందనే విషయం మాత్రం స్పష్టం అవుతోంది. అయితే అంతర్జాతీయ వేదికలపై భారత్ తటస్థంగా ఉండటం ఇదే తొలిసారి కాదు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయిన సమయంలోనూ అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఏ పక్షంలో చేరకుండా అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించారు. ప్రస్తుతం భారత్‌కు రష్యా, అమెరికా రెండూ చాలా కీలకం. పలు దేశాలు మామ్ భారత్ తటస్థ వైఖరిని అంగీకరించాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Russia-Ukraine War

  ఉత్తమ కథలు