హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్తరాలు బంద్...పాక్ నిర్ణయంపై కేంద్రమంత్రి ఫైర్

భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్తరాలు బంద్...పాక్ నిర్ణయంపై కేంద్రమంత్రి ఫైర్

అటారి-వాఘా సరిహద్దు

అటారి-వాఘా సరిహద్దు

పాక్, భారత్ దేశాల మధ్య పోస్టల్ మెయిల్ సర్వీసును ఏకపక్షంగా రద్దు చేసింది. దీనిపై భారత్ మండిపడుతోంది. ఇలా చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమైన చర్య అని భారత్ విమర్శించింది.

దాయాది పాకిస్థాన్ దేశం రోజు రోజుకి భారత్ తో సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే తమ గగనతలాన్ని వాడవద్దని ఆదేశించిన పాకిస్థాన్, ఇప్పుడు మరో వివాదానికి తావిచ్చింది. తాజాగా పాక్, భారత్ దేశాల మధ్య పోస్టల్ మెయిల్ సర్వీసును ఏకపక్షంగా రద్దు చేసింది. దీనిపై భారత్ మండిపడుతోంది. ఇలా చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమైన చర్య అని భారత్ విమర్శించింది. తమకు ఎలాంటి ముందస్తు నోటీస్ లేదని, కనీసం తపాలా శాఖకు ఉత్తరం ద్వారా తెలియచేయకుండా పాక్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. పాకిస్థాన్ అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, మన్ముందు వారికే ఇబ్బంది ఏర్పడతుందని భారత వర్గాలు విమర్శించాయి.

First published:

Tags: India pakistan, Pakistan, Pakistan army

ఉత్తమ కథలు