హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Modi ఉదారత : Afghanకు 5లక్షల Covaxin టీకాలు పంపిన భారత్.. థ్యాంక్స్ చెబుతోన్న Taliban

Modi ఉదారత : Afghanకు 5లక్షల Covaxin టీకాలు పంపిన భారత్.. థ్యాంక్స్ చెబుతోన్న Taliban

భారత్ స్వయంగా ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ, పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటోందని మరోసారి నిరూపించుకుంది. తాలిబన్ ఏలుబడిలోని అఫ్గాన్ కు భారత్ కీలక సాయాన్ని అందించింది. మోదీ సర్కార్ భాగస్వామ్యంతో..

భారత్ స్వయంగా ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ, పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటోందని మరోసారి నిరూపించుకుంది. తాలిబన్ ఏలుబడిలోని అఫ్గాన్ కు భారత్ కీలక సాయాన్ని అందించింది. మోదీ సర్కార్ భాగస్వామ్యంతో..

భారత్ స్వయంగా ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ, పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటోందని మరోసారి నిరూపించుకుంది. తాలిబన్ ఏలుబడిలోని అఫ్గాన్ కు భారత్ కీలక సాయాన్ని అందించింది. మోదీ సర్కార్ భాగస్వామ్యంతో..

ఆ పాలకులను యావత్ ప్రపంచం ఛీకొడుతోంది.. అగ్రరాజ్యాలన్నీ ఆర్థిక సహాయాన్ని నిలిపేశాయి.. మేం మారిపోయాం, ప్రపంచజీవన స్రవంతిలో కలిపోతామంటూనే రోజుకో కొత్త కఠిన చట్టాలు తెస్తున్నారు.. ఇకపై వాళ్లనెవ్వరూ నమ్మలేని పరిస్థితి. అయితే, అక్కడి ప్రజలది మాత్రం కడు దీనావస్థ. కరోనా దెబ్బకు ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినా టీకాల కొరత వేధిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి మానవత్వం చాటుకుంది భారతదేశం. మన పొరుగున ఉన్న అఫ్గానిస్థాన్ కు పెద్ద మొత్తంలో కొవిడ్ టీకాలను పంపింది మోదీ సర్కార్. వివరాలివి..

తాలిబన్ పాలన మొదలైన నాలుగు నెలల్లోనే అఫ్గానిస్తాన్ గతంలో కంటే అన్ని రకాలుగా మరింత దిగజారింది. అంతర్జాతీయ ఆర్థిక సహాయం కూడా నిలిచిపోవడంతో దేశీ కరెన్సీని బతికించుకోడానికి తాలిబన్ పాలకులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో అఫ్గాన్ పేద జనాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది చాలదన్నట్లు అక్కడ మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి పెరిగింది. మహమ్మారి నుంచి అక్కడి ప్రజల్ని కాపాడాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన విన్నపానికి భారత్ సానుకూలంగా స్పందించింది.

Vikarabad SI srinu naik : వారం కిందటే పెళ్లి.. అత్తారింట్లో ఒడి బియ్యం పోసుకొని వస్తుండగా..భారత్ స్వయంగా ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ, పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటోందని మరోసారి నిరూపించుకుంది. తాలిబన్ ఏలుబడిలోని అఫ్గాన్ కు భారత్ కీలక సాయాన్ని అందించింది. మోదీ సర్కార్ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్ కొవిడ్ టీకాలను మన కేంద్రం అఫ్గాన్ కు పంపింది. కొవాగ్జిన్ 5 లక్షల టీకా డోసులను కాబూల్‌లోని ఇందిరా గాంధీ పిల్లల ఆస్పత్రికి అందజేసింది భారత్.

Omicron : జనవరి 12 వరకు స్కూళ్లు మూసివేత.. సినిమా హాళ్లు బంద్.. సర్కారు ఉత్తర్వులుమానవతా దృక్పథంతో మన వంతు సహకారం అందించామని, 5లక్షల కొవాగ్జిన్ డోసులను ఇందిరాగాంధీ ఆసుపత్రికి అప్పగించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నెల ప్రారంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా భారత్.. అఫ్గానిస్థాన్ కు 1.6 టన్నుల వైద్య సామాగ్రిని కూడా అందించిన సంగతి తెలిసిందే. రాబోయే కొద్ది రోజుల్లోనే మనం.. గోధుమలు, ఇంకొన్ని వైద్య సామాగ్రిని అప్గాన్ కు పంపనున్నాం. భారత్ చేస్తోన్న సహాయం పట్ల తాలిబన్లు ధన్యవాదాలు తెలిపారు.

New Year 2022 in space : చరిత్రలో తొలిసారి.. అంతరిక్షంలో తెలుగోడి న్యూ ఇయర్ వేడుకలుఅఫ్గాన్ కు భారత్ పంపే వైద్య, కనీస సేవల రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. అఫ్గాన్ లో కొవిడ్ బారినపడిన సుమారు 8వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అధికారిక డేటాను సేకరించే వ్యవస్థ ఏదీ అక్కడలేదిప్పుడు. అమెరికా సైన్యాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ చేతుల్లోకి వెళ్లిన అఫ్గాన్ ను ఆదుకునేందుకు ఇరుగు పొరుగు దేశాలు, ప్రపంచ సంస్థలు చేస్తోన్న ప్రయత్నాల్లో భారత్ కీలక భూమిక పోషిస్తున్నది.

First published:

Tags: Afghanistan, Covaxin, Covid vaccine, India

ఉత్తమ కథలు