భారత్-రష్యా (India - Russia) ఆయుధ వ్యాపారం చాలా పాతది. భారత్‌కు ఎంతో విశ్వసనీయమైన ఆయుధాలు అందజేసే దేశంగా రష్యా (Russia) భారత్ నమ్మకాన్ని చూరగొంది. రష్యా మొత్తం ఆయుధాల ఎగుమతుల్లో భారత్ (India) వాటా 23% ఉంది. ఎన్నో ఆయుధాలను రష్యా భారత్‌కు అందజేసింది. 2030 నాటికి 1,770 ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (FRCVలు) కొనుగోలు చేయడానికి భారత సైన్యం RFI సమర్పించింది. అంతే కాకుండా గతంలో రష్యా తయారు చేసిన T-90 భీష్మ మరియు T-72 ఇండియా ఆయుధాల్లో టాప్‌గా ఉన్నాయి. తాజాగా భారత్ రష్యా సంయుక్తంగా మరో ఆయుధ తయారీకి ఒప్పందం కుదుర్చుకొన్నట్టు సమాచారం. రష్యా తన T-14 అర్మాటా ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక కొత్త యుద్ధ ట్యాంక్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్‌ను ఆఫర్ చేసిందని రష్యా యొక్క ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ ప్రతినిధి వలేరియా రెషెట్నికోవా స్పుత్నిక్ వార్తలకు తెలిపారు.
యుద్ధ ట్యాంక్ ఫీచర్స్..
RFI ప్రకారం, ప్రతిపాదిత FCRV "అత్యాధునిక", "సాంకేతికత-ప్రారంభించబడిన" మరియు "హై మొబిలిటీ" లక్షణాలను కలిగి ఉంటుంది, అలాగే ఎత్తైన ప్రాంతాలతో సహా వివిధ రకాల భూభాగాలలో పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
PM Kisan Scheme: ఖాతాల్లోకి రూ.2,000లు పీఎం కిసాన్ డబ్బులు.. ఎకౌంట్లో పడేదీ ఆ రోజే!
మైదానాలు, నదీతీర సరిహద్దులు మరియు ఎడారులల్లో దీని పనితీరు చాలా బాగుంటుందని తెలపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశం కూడా రష్యన్ స్ప్రట్-SDM1 లైట్‌వెయిట్ ట్యాంక్‌పై ఆసక్తి చూపింది. వైమానిక విస్తరణ సమయంలో ఓవర్‌లోడ్‌ను తట్టుకోగలదా అని చూడటానికి రష్యా ట్యాంక్‌ను పరీక్షించినట్లు సమాచారం.
చైనాను కట్టడి చేయడానికే..!
రష్యా లైట్‌వెయిట్ ట్యాంకులతో వివాదాస్పద సరిహద్దు వెంబడి చైనా టైప్ 15 లైట్ ట్యాంక్‌ను ఎదుర్కోవడానికి భారతదేశం ఈ ఆయుధానలను సేకరిస్తుందని సమాచారం. డిసెంబర్ నెల ప్రారంభంలో, స్ప్రుట్-SDM1 లైట్ యాంఫిబియస్ ట్యాంక్‌తో, రోసోబోరోనెక్స్‌పోర్ట్ లైట్ ట్యాంకుల కోసం భారతదేశం యొక్క టెండర్‌లో పాల్గొంటుందని సమాచారం. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ (Knowledge Transfer) అందజేస్తుందని రష్యన్ మీడియా పేర్కొంది.
ఇండియా అవసరాలకు సరిపోతుందా?
భారతదేశం తన ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాను ఎదుర్కోవడానికి ఆయుధ వ్యవస్థలను పదును పెడుతుంది. ఎత్తు ప్రదేశాల్లో యుద్ధం చేయడానిక అనుకూలమైన ఆయుధాలను అందజేస్తున్నట్టు సమాచారం. T-14 -50 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో పనిచేయగలదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.