భారత్ ఇప్పటికీ వెనుకబడి ఉందట.. అవినీతి సూచీ ఆసక్తికర గణాంకాలివే..!

భారత్ ఇప్పటికీ వెనుకబడి ఉందట.. అవినీతి సూచీ ఆసక్తికర గణాంకాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో అవినీతికి సంబంధించి, మరీ ముఖ్యంగా భారత్‌లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి సంబంధించి ట్రాన్ప్రరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్...

 • Share this:
  న్యూఢిల్లీ: భారత్‌లో అవినీతికి సంబంధించి, మరీ ముఖ్యంగా భారత్‌లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి సంబంధించి ట్రాన్ప్రరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్(సీపీఐ) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ అవినీతి అంచనాల సూచిక నివేదిక ప్రకారం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి విషయంలో భారత్ ఇప్పటికీ వెనుకబడి ఉందని తేలింది. 180 ప్రపంచ దేశాల్లో భారత్ ఆరు స్థానాలు కోల్పోయి 86వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ రంగ అవినీతిలో భారత్ 40 పాయింట్లతో ఉండటం గమనార్హం. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో 2019తో పోల్చుకుంటే 2020లో అవినీతి కాస్తంత పెరిగింది. స్కోర్ 32 నుంచి 31కి పడిపోయింది. చైనా 78వ స్థానంలో ఉండగా, 42 పాయింట్ల స్కోర్‌ను సాధించింది. చైనాతో పోల్చుకుంటే భారత్ స్కోర్ రెండు పాయింట్లు తక్కువగా ఉంది. అవినీతి నిరోధం విషయంలో తొలి స్థానాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్ దేశాలు నిలిచాయి. ఈ రెండు దేశాలు 88 పాయింట్లను సాధించాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతిని నిరోధించిన దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ తర్వాత స్విట్జర్లాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, సింగపూర్ దేశాలు నిలిచాయి. ఈ నాలుగు దేశాలు 85 పాయింట్లను సాధించాయి.

  ఆస్ట్రేలియా, హాంకాంగ్ దేశాల్లో కూడా అవినీతి తగ్గుముఖం పట్టింది. ఈ రెండు దేశాలు 77 స్కోర్‌ను సాధించాయి. దక్షిణ సూడాన్, సోమాలియా దేశాలు ఈ ర్యాకింగ్స్‌లో చిట్టచివర నిలిచాయి. 12 పాయింట్లను మాత్రమే సాధించాయి. దక్షిణ సూడాన్, సోమాలియా దేశాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందని ఈ నివేదికతో స్పష్టమైంది. ఇదిలా ఉంటే.. ఈ నివేదిక కోసం 0 నుంచి 100 వరకూ స్కేల్‌ను నిర్దేశించారు. సున్న అయితే అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలని, 100 అయితే పూర్తిగా అవినీతి రహిత దేశాలుగా అవినీతి నిరోధక సూచీ నిర్దేశించింది. ఈ సూచీపై ఆర్థిక రంగంలో ఓ అభిప్రాయం కూడా ఉంది. ట్రాన్ప్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ ఇండెక్స్ పూర్తిగా కచ్చితమైన, పారదర్శకమైన అవినీతి స్థాయిలను సూచించలేదని ఆర్థిక నిపుణుల భావన.
  Published by:Sambasiva Reddy
  First published:

  అగ్ర కథనాలు