భారత్ (India), చైనా (china) సరిహద్దుల్లో (borders) గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే శీతాకాలం (winter) అత్యంత గడ్డు పరిస్థితులు ఎదర్కొవాల్సి రావచ్చు. ఎందుకంటే 13వ రౌండ్లో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు (Corps Commander-level talks) విఫలం అయ్యాయి. దీంతో ఎల్ఏసీ వద్ద పెరిగిన ఉద్రిక్తతలు పెరిగాయి. హాట్ స్ప్రింగ్స్ (Hot Springs) నుంచి వైదొలగడానికి చైనా నిరాకరించడంతో శీతాకాలంలో సవాళ్లు ఎదురు కానున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భారత్ LAC వద్ద ముఖ్యంగా లడక్ (Ladakh)లో మౌలిక సదుపాయాలను పెంచుతోంది.
అధునాతన ఆయుధాలతో..
అధునాతన ఆయుధాల (weapons)తో ఆర్మీ (army) సన్నద్ధమైతోంది. ముఖ్యంగా లేటెస్ట్ ఫిన్నిష్ సాకో స్నిపర్ రైఫిల్స్ (LATEST FINNISH SAKO SNIPER RIFLES), ఇజ్రాయెల్ నెగెవ్ లైట్ మెషిన్ గన్స్ (ISRAELI NEGEV LIGHT MACHINE GUNS), ది అమెరికన్ సిగ్ సౌర్ అసోల్ట్ రైఫిల్స్ (THE AMERICAN SIG SAUER ASSAULT RIFLES), సమకాలీన డ్రోన్లు, K9 వజ్ర T గన్స్, M777 అల్ట్రా-లైట్ హౌవిట్జర్స్ (ULH) అందుబాటులో ఉంచుకుంది. అయితే ఎల్ఏసీ వద్ద కఠినమైన భూభాగం (harsh terrain), తీవ్ర ఎత్తు, తక్కువ ఉష్ణోగ్రతల (sub-zero temperatures) తో జవాన్లకు సవాళ్లు ఎదురు కానున్నాయి.
శీతాకాలంలో సరిహద్దు భద్రతపై భారత్ వ్యూహాలు ఎలా ఉన్నాయంటే..
ఎల్ఏసీ వద్ద సైనిక మౌలిక సదుపాయాలను చైనా పెంచుతున్నప్పటికీ (ramping up military infrastructure) భారత్ వెనకబడలేదు. సైనిక అధికారుల లెక్కల ప్రకారం.. ఎల్ఏసీ వద్ద దాదాపు 50 వేల నుంచి 60 వేల వరకు భారత్ అదనపు దళాలు మోహరించాయి. స్ట్రైక్ కార్ప్స్ (strike corps) తో సహా ఇప్పటికే ఉన్న కొన్ని నిర్మాణాలను భారత సైన్యం పునర్వ్యవస్థీకరించింది. తూర్పు లడక్ ఎత్తైన ప్రదేశాలలో K9 వజ్ర T గన్స్ రెజిమెంట్ మోహరించింది. LAC వెంట వివిధ ప్రదేశాలలో M777 ULH గల 3 రెజిమెంట్‌లు మోహరించింది. మరోవైపు 2021 చివరి నాటికి నాలుగో అల్ట్రా లైట్ హోవిట్జర్ (ULH) రెజిమెంట్ ను పెంచే అవకాశం ఉంది. ఫ్రంట్‌లైన్ దళాలకు ఇప్పటికే అమెరికన్ సిగ్ సౌర్ అస్సాల్ట్ రైఫిల్స్ అందించారు. భారత్ అదనపు తిరుగుబాటు దళాలు, అదనపు పదాతి దళ బ్రిగేడ్ల అదనపు విభాగాన్ని కూడ చేర్చింది. చైనీస్ ఆయుధ నిర్మాణాలను పోలిన ట్యాంకులు, తుపాకులతో బహుళ సాయుధ , యాంత్రిక యూనిట్లు మోహరించాయి.
భారతదేశ సరిహద్దు నిర్మాణం వద్ద ITBP (Indo-Tibetan Border Police) ప్రణాళికలేంటంటే..
సరిహద్దును పెంచుకునేందుకు చైనా, ఇండియా పోటీ
భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన
ఏప్రిల్ 2020 నుంచి తూర్పు లడక్‌లో భారత్, చైనాల మధ్య సైనిక వివాదం నడుస్తోంది. పాంగాంగ్ త్సో సమీపంలో భారత గస్తీని చైనా నిలిపివేసిన తర్వాత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 2021 లో పాంగోంగ్ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి భారత్, చైనా సైనికులు విరమించుకున్నాయి. వ్యూహాత్మకంగా ఉన్న డెప్‌సాంగ్ మైదానాలలో భారత గస్తీకి PLA అవరోధాలు సృష్టిస్తోంది. అయితే చైనా PLA సెప్టెంబర్ 2021 లో ఉత్తరాఖండ్ బారాహోటి సెక్టార్‌లోని LAC ని అతిక్రమించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్ మరియు చైనా సైనికుల మధ్య ఘర్షణ సైతం చోటుచేసుకుంది. మరోవైపు అక్టోబర్ 10 న రెండు దేశాల మధ్య 13 వ రౌండ్ చర్చలు సైతం విఫలం అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, China, India, India-China, Infrastructure