రాయబారానికి రెడీ.. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలపై ట్రంప్

India Pakistan Live | భారత్ - పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

news18-telugu
Updated: February 28, 2019, 8:36 PM IST
రాయబారానికి రెడీ.. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలపై ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
  • Share this:
భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసేందుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అందుకు సానుకూల వైఖరితో ఉన్నామన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చివరి అంకానికి చేరుకున్నాయని.. త్వరలోనే ముగిసిపోతుందన్నారు. రెండు దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదని ట్రంప్ అన్నారు. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోందన్నారు. దురదృష్టవశాత్తూ వారి మధ్య దురభిమానం ఏర్పడిందన్నారు. అందుకే వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. రెండు వర్గాల వారికి సాయం చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. ఈ సమయంలో శాంతి నెలకొల్పేందుకు తమతో పాటు కలిసిరావడానికి సంస్థలు ముందుకొస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి నెలకొంటుందని ట్రంప్ ఆకాంక్షించారు.
First published: February 28, 2019, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading