Home /News /international /

INDIA OFFERS FIGHTER JET TRAINER TO USA GH MK

Fighter jet trainer: అమెరికాకు ఫైటర్ జెట్ ట్రైనర్‌ను ఆఫర్ చేసిన భారత్...సత్తా చాటిన HAL

భారత్ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA)గా పేర్కొనే లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ (LIFT) వెర్షన్ ను అమెరికాకు ఆఫర్ చేసింది. ఆఫర్ చేసిన ఎల్‌సిఎ విమానాన్ని భారతీయ డెవలపర్లు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించనున్నారు.

భారత్ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA)గా పేర్కొనే లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ (LIFT) వెర్షన్ ను అమెరికాకు ఆఫర్ చేసింది. ఆఫర్ చేసిన ఎల్‌సిఎ విమానాన్ని భారతీయ డెవలపర్లు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించనున్నారు.

భారత్ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA)గా పేర్కొనే లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ (LIFT) వెర్షన్ ను అమెరికాకు ఆఫర్ చేసింది. ఆఫర్ చేసిన ఎల్‌సిఎ విమానాన్ని భారతీయ డెవలపర్లు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించనున్నారు.

ఇటీవల ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఐదు రఫేల్(Rafale) యుద్ద విమానాలు భారత వైమానిక దళం(Indian Air Force )లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు భారతదేశానికి ఐదు రాఫెల్ (Rafale) యుద్ధ విమానాలు మాత్రమే రాగా, ఫ్రాన్స్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం 36 విమానాలు భారత్కు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి విమానాల అవసరం కూడా భారత్కు ఎక్కువగానే ఉంది. కానీ, వీటిని భారత్ ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటుంది. భారత్లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి(HAL) విమాన తయారీలో అనుభవం ఉన్నప్పటికీ, ఇతర దేశాల నుంచి విమానాలను దిగుమతి చేసుకోవడం సరైన విధానం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల అవసరం ఉందని వారు నొక్కి చెబుతున్నారు. దీంతో భారత్ స్వయం సమృద్ది దిశగా యుద్ద ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తుంది. కాగా, ప్రస్తుతం యుఎస్ నేవీ అండర్గ్రాడ్యుయేట్ జెట్ ట్రైనింగ్ సిస్టమ్ (UJTS) కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది. దీనికి ప్రతిస్పందనగా, భారత్ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA)గా పేర్కొనే లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్ (LIFT) వెర్షన్ ను అమెరికాకు ఆఫర్ చేసింది. ఆఫర్ చేసిన ఎల్‌సిఎ విమానాన్ని భారతీయ డెవలపర్లు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించనున్నారు.

ఆఫర్ ను అంగీకరించే అవకాశాలే ఎక్కువ..

కాగా, ఈ విమానానికి సంబంధించిన పనులన్నీ భారత్లోనే జరుగుతున్నాయని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చైర్‌పర్సన్ ఆర్ మాధవన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ‘‘తేలికపాటి హెలికాప్టర్ల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) అనుమతి పొందింది. ఒకవేళ యూఎస్ నేవీకి ఫైటర్ జెట్(fighter jet) విమానంలో రాఫెల్ లక్షణాలు అవసరమైతే, దానికి అనుగుణంగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అమెరికాకు ఆఫర్ చేసిన విమానం భారత వైమానిక దళం ఆదేశించిన LCA MK1A విమానంపై ఆధారపడి ఉంటుంది.” అని అన్నారు. కాగా, భారత్ ఇచ్చిన ఆఫర్ను యుఎస్ నేవీ (US Navy )అంచనా వేస్తోంది. ఇది విజయవంతమైతే భారతదేశం వైపు నుండి ఒక ట్రైనర్ను కూడా యూఎస్కు అందజేయనున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రకమైన విమానం ప్రస్తుతం అమెరికాలో లేనందున యుఎస్ నేవీ (US Navy) చేత షార్ట్ లిస్ట్ పొందటానికి, తమ ఆఫర్ ను అంగీకరించడానికి ఎక్కువ అవకాశం ఉందని డెవలపర్లు(developers) భావిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Indian Army

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు