బ్లూఫిల్మ్స్ తెగ చూస్తున్న భారతీయులు... ప్రపంచంలోనే టాప్...

ప్రపంచవ్యాప్తంగా బ్లూఫిల్మ్స్ ఎక్కువగా చూస్తున్న దేశంగా భారత్ టాప్‌లో నిలిచింది. ఇందుకు కారణమేంటి?

news18-telugu
Updated: January 6, 2020, 7:00 AM IST
బ్లూఫిల్మ్స్ తెగ చూస్తున్న భారతీయులు... ప్రపంచంలోనే టాప్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మన దేశంలో జనాభా ఎక్కువ. సో... బ్లూఫిల్మ్స్ చూసేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం... ఆ లిస్టులో భారత్ టాప్‌లో నిలవడం చిత్రమేమీ కాదు. కాకపోతే... ఇది మన దేశానికి ఏమాత్రం మంచి పరిణామం కాదు. ఇలాంటి నగ్న చిత్రాలు అదేపనిగా చూస్తూ... చాలా మంది అడ్డదారులు పడుతున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఎన్నో పరిశోధనలు చెబుతూనే ఉన్నాయి. నిజానికి నగ్న చిత్రాలు, వీడియోలూ చూసేవాళ్లలో అమెరికా ఎప్పుడూ ముందుంటుంది. అక్కడి చాలా రాష్ట్రాల్లో వ్యభిచారం అన్నది చట్టబద్ధం కాబట్టి... పోర్నోగ్రఫీ అక్కడ పెద్ద బిజినెస్. సెక్స్ పరంగానే కాదు... సెక్స్ టాయ్స్, సెక్స్ మూవీస్, సెక్స్ సైకాలజీ ఇలా ఎన్నో రకాలున్నాయి అక్కడ. అలాంటి అమెరికాను వెనక్కి నెట్టి భారతీయులు... విపరీతంగా సెక్స్ మూవీస్, క్లిప్స్, వీడియోలు, ఫొటోలు చూస్తూ... ప్రపంచంలోనే ఈ విషయంలో టాప్‌లో నిలిచారు. అందువల్ల అమెరికా సెకండ్ పొజిషన్‌లో నిలిచింది. బ్రెజిల్, జపాన్... తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండియాలో 3జీతో పోల్చితో... 4జీ ఇంటర్నెట్ తక్కువ రేటుకు వస్తుండటంతో... భారతీయులు... 89 శాతం మంది స్మార్ట్ మొబైళ్లలోనే నీలి చిత్రాలు, వీడియోలూ చూస్తున్నారని సర్వేలో తేలింది.

పోర్నోగ్రఫీకి పెట్టింది పేరైన పోర్న్ హబ్ వెబ్‌సైట్ ప్రతీ సంవత్సరం ఈ సర్వే చేస్తుంది. ఎవరెవరు ఏయే పోర్న్ సైట్లలోకి ఎంటరవుతున్నారు? వాళ్లు ఎంత సేపు ఆ సైట్లలో గడుపుతున్నారు? ఏ ఫొటోలను ఎక్కువగా చూస్తున్నారు? ఏ సెలబ్రిటీ వీడియోను ఎక్కువ సేపు చూస్తున్నారు? ఇలాంటి డేటా మొత్తం ఆ సైట్ ఏటా సేకరిస్తోంది. అమెరికాలో 81 శాతం మందే మొబైళ్లలో పోర్న్ ఫిల్మ్స్ చూస్తుంటే... భారతీయులు... 89 శాతం అలా చూస్తున్నారంటే... మన దేశంలో స్మార్ట్ మొబైళ్ల వాడకం ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచంలో ప్రతి నలుగురు పోర్న్ చిత్రాల్ని చూసేవాళ్లలో... ముగ్గురు స్మార్ట్ ఫోన్లలోనే వాటిని చూస్తున్నారని పోర్న్ హబ్ తేల్చింది. యాజ్ యూజువల్‌గా డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లలో వాటిని చూసేవాళ్ల సంఖ్య తగ్గిందని చెప్పింది.

మీకు మరో ఆసక్తికర విషయం చెప్పనా. ఇండియాలో చాలా మంది తమ మొబైళ్లలో జియో ఇంటర్నెట్ వాడుతున్నారు. చాలా మంది రోజుకు 2 జీబీ డేటా వాడుకునేలా రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఆ లెక్కన వాళ్లు నెలకు 60 జీబీ వాడుకోవచ్చు. కానీ... భారతీయులు యావరేజ్‌గా నెలకు వాడుతున్న డేటా 9.8 జీబీయే. అంటే... నెలకు 10 జీబీ కూడా వాడట్లేదు. మిగతా 50 జీబీ వాడకుండానే వదిలేస్తున్నారనుకోవచ్చు. ఐతే... జియోతోపాటూ... ఎయిర్‌టెల్, ఐడియా, BSNL డేటా కూడా వాడేవారు కూడా మన దేశంలో ఉన్నారు. అందరూ ఆపరేటర్లూ ఎక్కువ గానే డైలీ డేటా ఇస్తున్నారు. మనమే వాడుకోలేకపోతున్నాని ఎరిక్సన్ సంస్థ సర్వే ద్వారా అర్థమవుతోంది.
Published by: Krishna Kumar N
First published: January 6, 2020, 7:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading