హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

India in UNGA: కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌కు భారత్‌ ధీటైన జవాబు.. ఐరాసలో భారత ప్రతినిధిపై ప్రశంసలు

India in UNGA: కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌కు భారత్‌ ధీటైన జవాబు.. ఐరాసలో భారత ప్రతినిధిపై ప్రశంసలు

India in UNGA: కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌కు భారత్‌ ధీటైన జవాబు.. ఐరాసలో భారత ప్రతినిధిపై ప్రశంసలు (Image Credit : Twitter)

India in UNGA: కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌కు భారత్‌ ధీటైన జవాబు.. ఐరాసలో భారత ప్రతినిధిపై ప్రశంసలు (Image Credit : Twitter)

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (UNGA) 77వ సమావేశాల సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చేసిన ఆరోపణలను భారత్ (India) తిప్పికొట్టింది. షరీఫ్ ఇండియాపై తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరం అని పేర్కొంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (UNGA) 77వ సమావేశాల సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చేసిన ఆరోపణలను భారత్ (India) తిప్పికొట్టింది. షరీఫ్ ఇండియాపై తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరం అని పేర్కొంది. సెప్టెంబరు 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో షరీఫ్ మాట్లాడుతూ, ఇండియాతో సహా పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. దక్షిణాసియాలో సుస్థిరమైన శాంతి, స్థిరత్వం అనేది జమ్మూ కశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వతమైన పరిష్కారంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారం హక్కును తిరస్కరించడమే ఈ దీర్ఘకాలిక వివాదానికి కేంద్రంగా మారిందని షరీఫ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నిటికీ ‘రైట్ ఆఫ్ రిప్లై’ సెషన్‌లో భారత దౌత్యవేత్త, ఫస్ట్ సెక్రటరీ మిజితో వినిటో దీటైన బదులిచ్చారు.

పాక్ ప్రధాని షెహబాజ్ తన ప్రసంగంలో కశ్మీర్ గురించి 10 సార్లు.. భారతదేశం గురించి 9 సార్లు ప్రస్తావించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ఏకపక్ష రద్దు నిర్ణయం వల్లే శాంతి అనేది లేకుండా పోయిందని.. తమ దేశం శాంతిని తప్ప హింసను ఎప్పటికీ కోరుకోలేదన్నట్టు మాట్లాడారు. దాంతో భారత దౌత్యవేత్త, ఫస్ట్ సెక్రటరీ మిజిటో వినిటో పాక్‌ ప్రధానికి దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చారు.

భారత్ రిప్లై ఇదే..

శుక్రవారం నాడు UNGA ప్రసంగాల ముగింపు తర్వాత ‘రైట్ ఆఫ్ రిప్లై’ సెషన్‌లో పాక్ పీఎం షెహబాజ్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తన సొంత దేశంలో చోటుచేసుకునే దుర్మార్గపు పనులను ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టడానికి.. భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన చర్యలను సమర్థించుకోవడానికి ఆయన (పాక్ ప్రధాని) ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. పాక్ భారత్‌కు వ్యతిరేకంగా చేసే చర్యలను పాపిష్ఠి పనులుగా, సహించలేని చర్యలుగా మిగతా ప్రపంచమంతా పరిగణిస్తుందని వినిటో గట్టిగా బదులిచ్చారు.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ముంబై ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తారా?

పాక్ తన పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నట్లు చెబుతోంది కానీ అలా చెప్పుకునే ఏ దేశాలు కూడా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎప్పటికీ పెంచి పోషించవని వినిటో వ్యాఖ్యానిస్తూ పాక్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేశారు. "శాంతినే కోరుకునే వారైతే భయంకరమైన ముంబై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వరు. శాంతి కావాలనుకునే దేశం పొరుగువారిపై అన్యాయమైన, సమర్థించలేని వాదనలు చేయదు.” అంటూ పాక్‌పై ధ్వజమెత్తారు.

AP-TS Postal GDS Results: పోస్టల్ జీడీఎస్ ఫలితాలు.. ఐదో లిస్ట్ ను ప్రకటించిన అధికారులు..

క్లాసిక్ సెటిలర్ కలోనియల్ ప్రాజెక్ట్‌లో, చట్టవిరుద్ధమైన జనాభా మార్పుల ద్వారా ముస్లిం మెజారిటీ జమ్మూ, కశ్మీర్‌ను హిందూ భూభాగంగా మార్చాలని భారతదేశం ప్రయత్నిస్తోందని షరీఫ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండియా కశ్మీరీల నుంచి భూమి లాక్కుందని.. తప్పుడు ఓటర్లను నమోదు చేసిందని.. ఎన్నికలలో అన్యాయమైన ప్రయోజనాన్ని పొందేందుకు ఆ టెరిటోరియల్ యూనిట్‌ను విభజించిందని ఆరోపించారు. ఇండియాలో ఇస్లామోఫోబియా ఉందనడానికి వివక్షాపూరిత చట్టాలు, విధానాలు, హిజాబ్ నిషేధాలు, మసీదులపై దాడులు నిలువుటద్దంగా నిలుస్తున్నాయని నిరాధార వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలను కూడా వినిటో ఖండించారు.

Published by:Veera Babu
First published:

Tags: India, India pakistan, Pakistan, UNO

ఉత్తమ కథలు