హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఇవిగో పుల్వామా ఉగ్ర దాడి ఆధారాలు... పాకిస్థాన్‌కు సమర్పించిన భారత్

ఇవిగో పుల్వామా ఉగ్ర దాడి ఆధారాలు... పాకిస్థాన్‌కు సమర్పించిన భారత్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Vs Pakistan : పుల్వామా ఉగ్ర దాడికి పాల్పడింది జైషే మహ్మద్ అని నిరూపించాలని పాకిస్థాన్ కోరుతుండటంతో భారత ప్రభుత్వం కొన్ని ఆధారాలు సమర్పించింది. మరి ఇమ్రాన్ ఖాన్ చర్యలు తీసుకుంటారా?

పుల్వామా ఉగ్ర దాడి వెనక జైషే మహ్మద్ ఉందని భారత్ చెబుతుంటే, అదేమీ లేదని చెబుతున్న పాకిస్థాన్... ప్రపంచ దేశాల ముందు భారత్‌ని తప్పు పట్టేందుకు యత్నిస్తోంది. వాస్తవాల్ని వక్రీకరించే ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్న భారత్... పుల్వామా ఉగ్ర దాడి వెనక పాకిస్థాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉంది అనేందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడింది జైషే మహ్మద్ ఉగ్రవాది అని, అతనికి పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు సాయం చేశాయనేందుకు స్పష్టమైన ఆధారాల్ని పాకిస్థాన్‌కు ఇచ్చింది భారత్. మన దేశంలోని పాకిస్థాన్ తాత్కాలిక హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు ఈ ఆధారాలు సమర్పించింది.


ఆధారాలు సమర్పిస్తే... నిస్పాక్షికంగా దర్యాప్తు జరిపిస్తానని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్... భారత్‌కు చెప్పడంతో భారత విదేశాంగ శాఖ ఈ డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ ఆధారాలను చూశాకైనా పాకిస్థాన్ తక్షణ చర్యలు తీసుకుంటుందనీ, వాస్తవాధీన రేఖ వెంట ఉగ్రవాద శిబిరాల్ని తొలగిస్తుందని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.


కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిపిన ఉగ్ర దాడిలో 40 మంది CRPF సైనికులు చనిపోయారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఆదిల్ దార్... పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో ట్రైనింగ్ తీసుకున్నట్లు భారత్ ఆధారాలు సేకరించింది. దీనిపై బుధవారం స్పందించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.


రెండు దేశాలూ అణ్వాయుధాలు కలిగినవే కావడం వల్ల... భారత్ ఇలా ఆధారాలు సమర్పించడం మంచి పరిణామంగా భావించవచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఆఫర్ దృష్ట్యా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తన సచ్చీలతను నిరూపించుకోవాల్సి ఉంది.


 

ఇవి కూడా చదవండి :


యాపిల్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు... చకచకా...


మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి


వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?


ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలా? మీ కోసమే ఈ వెబ్‌సైట్లు... ట్రై చెయ్యండి మరి

First published:

Tags: India, India VS Pakistan, Jammu and Kashmir, Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

ఉత్తమ కథలు