ప్రపంచ దేశాలలో భారత్ మరోసారి తన సత్తా చాటుకుంటుంది. పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలతో భారత్ గట్టి పోటీనిస్తుంది. అగ్రదేశాలైన.. అమెరికా, బ్రిటన్,చైనా ల ఆర్థిక వ్యవస్థలు మెల్లగా దిగజారుతుంది. దీంతో అనేక దేశాలలో ప్రస్తుతం మాంద్యం నెలకొంది. అనేక దేశాలు శ్రీలంక బాట పడుతున్నాయి. అయితే.. భారత్ ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు 7 శాతానికి మించి ఉంటుందని, ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. బ్లూమ్ బర్గ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. భారత్, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఐదోవ స్థానాన్ని ఆక్రమిస్తుందని తెలుస్తోంది. ఐఎంఎఫ్ జీడీపీ ఆధారంగా ఇండియా మొదటి త్రైమాసికంలో.. తన ఆధిక్యాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక సమస్యలు, రాజకీయ మార్పులతో బ్రిటన్ సతమత మవుతుంది. అదే విధంగా యూకేలో కొత్త ప్రధాని ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. లిస్ ట్రస్,రిషి సునక్, ల మధ్య గట్టి పొటి నెలకొంది. అదేవిధంగా.. సత్యవర్థి రాథోడ్ కూడా పోటిని ఇస్తున్నారు . ద్రవ్యోల్బణం, మాంద్యం బ్రిటన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. భారత్.. 7 శాతం గ్రోత్ రేట్ ను కల్గి ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థ పరిణామం 854.7 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్రిటన్ ఆర్థిక పరిస్థితి 816 డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. అమెరికా తొలిస్థానంలో, చైనా, జపాన్, జర్మనీ, లు వరుసగా ఇండియా, బ్రిటన్ స్థానంలో.. ఐదవ స్థానంలో ఉండబోతున్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా చైనాలో మళ్లి లాక్ డౌన్ విధించారు.
కరోనావైరస్(Covid 19) కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా(China)లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా కోవిడ్ కేసులు(Covid Cases) మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో(Chengdu) కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 కోట్లకు పైగా జనాభా కలిగిన చెంగ్డు సిటీలో లాక్ డౌన్(Lockdown In Chengdu) విధిస్తున్నట్లు స్థానిక అధికారులు గురువారం (సెప్టెంబర్ 1,2022) తెలిపారు. సోమవారం నుండి బుధవారం వరకు సిచువాన్ ప్రావిన్స్(Sichuan Province) లో 492 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య అధికారులు నివేదించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
"కనిపించని భారీ వ్యాప్తి,చెల్లాచెదురుగా ఉన్న కేసులు, అనేక రకాల ప్రమాద ప్రదేశాలతో ఈ సారి మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉంది. మొత్తం సిటీలో అంటువ్యాధి పరిస్థితి చాలా క్లిష్టంగా, తీవ్రంగా ఉంది" అని గురువారం విలేకరుల సమావేశంలో సిటీ హెల్త్ కమిషన్ డైరక్టర్ యాంగ్ జియావోగువాంగ్ తెలిపారు. చెంగ్డు సిటీలో సెప్టెంబరు 1-4 మధ్య నగరంలో అనేక రౌండ్ల PCR పరీక్షలు జరుగుతాయి, నివాసితులు గురువారం ఉదయం 10 గంటల నుండి తమ ఇళ్లను విడిచి బయటకు వెళ్లవద్దని కోరారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే రోజువారీ సరుకుల కోసం బయటకు వెళ్లవచ్చని, 24 గంటల్లోగా నెగెటివ్ PCR పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని, అత్యవసర అవసరం లేకుండా పౌరులు నగరాన్ని విడిచిపెట్టకూడదని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imf, United Kingdom, VIRAL NEWS