ఇతర దేశాలకు విమాన ప్రయాణాలు ప్రారంభం..!

news18-telugu
Updated: September 22, 2020, 3:24 PM IST
ఇతర దేశాలకు విమాన ప్రయాణాలు ప్రారంభం..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోవిడ్ -19 నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు నెలకొన్నాయి. భారత్ నుంచి ఇతర దేశాలకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆయా దేశాలు ఇప్పుడిప్పుడే నిబంధనలు సులభతరం చేస్తూ ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణాలను విస్తరించేందుకు భారత్ పది దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకుంది. యూఎస్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, మాల్దీవులు, యూఏఈ, ఖతార్, ఆఫ్గానిస్థాన్, బహ్రెయిన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఏమిటీ ఒప్పందం?

కరోనా వైరస్ విజృంభణ తరువాత అంతర్జాతీయ విమాన సర్వీసులను దాదాపు అన్ని దేశాలు ఆపేశాయి. కొంతకాలం తరువాత అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు దేశాలు చేసుకునే తాత్కాలిక ఒప్పందాలు ఇవి. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలనూ ఈ ఒప్పందంలో భాగం చేస్తారు. అంటే కెనడాకు మన దేశ విమానాలు వెళ్లాలంటే, కెనడా విమానాలు మన దేశానికి వచ్చేందుకు అనుమతివ్వాలి. దీంతో రెండు దేశాల విమానయాన సంస్థలూ ప్రయోజనాలను పొందుతాయి. విమానాల టికెట్లను ఎయిర్లైన్స్ వెబ్సైట్, ట్రావెల్ ఏజెంట్లు, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా విక్రయిస్తారు.

పెరగనున్న అంతర్జాతీయ సర్వీసులు
కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణాలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ విమాన కార్యకలాపాలపై కొన్ని ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. వందే భారత్ మిషన్, ఎయిర్ బబూల్ ఆపరేషన్స్ను విజయవంతం చేయడానికి ఏవియేషన్, హెల్త్ ఇన్ఫాస్ర్టక్చర్ రంగాలు కృషి చేస్తున్నాయి. విమాన ప్రయాణాలు చేసేవారిపై క్వారంటైన్, ఇతర ఆరోగ్యపరమైన నిబంధనలు సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ర్టాలకు సూచించింది. ఇది ఇతర దేశాలకు ప్రయాణించాలనుకునేవారికి ఉపయోగపడే నిర్ణయం. సాధారణ అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఇప్పటి నుంచి పెరిగే అవకాశం ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులకు ఒక్కో దేశం ఒక్కోరకమైన నియమ నిబంధనలు విధించింది. అమెరికా వంటి దేశాలు ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను పునఃప్రారంభించాయి. కరోనా లేదనే ధ్రువపత్రం సమర్పిస్తేనే ప్రయాణికులను తమ భూభాగంలోకి అనుమతిస్తామని మరికొన్ని దేశాలు చెబుతున్నాయి. 48 గంటల్లో తాము కరోనా టెస్టు చేయించుకున్నామని, రిపోర్టు నెగెటివ్ వచ్చిందనే ఆధారాలు చూపితేనే ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కొన్ని దేశాలు అనుమతిస్తున్నాయి.
Published by: Sumanth Kanukula
First published: September 22, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading