రేపు భారత్ - పాక్ విదేశాంగ మంత్రుల ఫేస్ టు ఫేస్

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాకిస్తాన్‌ను ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో ఉన్న ఆసియా సొసైటీని ఉద్దేశించి మాట్లాడిన జైశంకర్ పాకిస్తాన్‌ను టెర్రరిస్తాన్‌గా అభివర్ణించారు.

news18-telugu
Updated: September 25, 2019, 10:15 PM IST
రేపు భారత్ - పాక్ విదేశాంగ మంత్రుల ఫేస్ టు ఫేస్
విదేశాంగ మంత్రి జయశంకర్
news18-telugu
Updated: September 25, 2019, 10:15 PM IST
భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రులు రేపు ఎదురుపడనున్నారు. న్యూయార్క్‌లో రేపు మధ్యాహ్నం సార్క్ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హాజరుకానున్నారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అమెరికా గడ్డ మీద నుంచి పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. అమెరికాలో ట్విన్ టవర్స్ మీద దాడి చేసిన వారు, ముంబైలోని తాజ్ హోటల్ మీద దాడిచేసిన వారు ఎక్కడ ఉన్నారో ప్రపంచానికి తెలుసని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఉడికిపోతోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ప్రతిసారీ భారత్‌కే మద్దతు దక్కుతోంది. మరోవైపు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాకిస్తాన్‌ను ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో ఉన్న ఆసియా సొసైటీని ఉద్దేశించి మాట్లాడిన జైశంకర్ పాకిస్తాన్‌ను టెర్రరిస్తాన్‌గా అభివర్ణించారు.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...