Home /News /international /

INDIA DROPS TO 54TH PLACE IN WEF TRAVEL AND TOURISM DEVELOPMENT INDEX BUT TOPS IN SOUTH ASIA PVN

Travel and Tourism : అంతర్జాతీయ పర్యాటక సూచీ..దక్షిణాసియాలో భారత్ నెం.1

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 Travel and Tourism Development Index : కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల మందగమనం తర్వాత, భారతదేశం యొక్క ప్రయాణ మరియు పర్యాటక రంగం "పునరుద్ధరణ సంకేతాలను" చూపింది. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (WEF)యొక్క తాజా అధ్యయనం ప్రకారం.. ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో దక్షిణాసియాలో భారత్ అగ్రగామిగా ఉంది.

ఇంకా చదవండి ...
Travel and Tourism Development Index : కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల మందగమనం తర్వాత, భారతదేశం యొక్క ప్రయాణ మరియు పర్యాటక రంగం "పునరుద్ధరణ సంకేతాలను" చూపింది. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (WEF)యొక్క తాజా అధ్యయనం ప్రకారం.. ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో దక్షిణాసియాలో భారత్ అగ్రగామిగా ఉంది. ఇక,మొత్తంగా చూస్తే ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46 స్థానాన్ని దక్కించుకున్న మన దేశం ఎనిమిది స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి పడిపోయింది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్ పేరుతో మొత్తం 117 దేశాల్లో పర్యాటక రంగ పురోగతిని సమీక్షించి ఈ నివేదిక రూపొందించింది WEF.

"ట్రావెల్ & టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2021: సస్టైనబుల్ అండ్ రెసిలెంట్ ఫ్యూచర్ కోసం పునర్నిర్మాణం" అనే టైటిల్ తో చేపట్టిన ఈ అధ్యయనం ట్రావెల్ అంట్ టూరిజం రంగం యొక్క స్థిరమైన మరియు స్థితిస్థాపక అభివృద్ధిని సాధ్యపరిచే ఫ్యాక్టర్స్ మరియు పాలసీలను పరిగణలోకి తీసుకుంది. ఇది ఒక దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ సంవత్సరం సూచికలో - ఐదు ఉప సూచికలు, 17పిల్లర్స్ మరియు 112 వ్యక్తిగత సూచికలు ఉన్నాయి. ప్రయాణాలు, పర్యాటకం అనే అంశంలో రెండేళ్లకు ఒకసారి అధ్యయనం చేసి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. గత రెండేళ్లు కరోనాతో విలవిలలాడిపోయిన ప్రపంచ దేశాల్లో ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం గాడిన పడుతోందని, అయినా ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

ALSO READ  Video : షాకింగ్.. కూల్ డ్రింక్ లో బల్లి..మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌ లెట్‌ సీజ్

పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో జపాన్‌ మొదటి స్థానంలో నిలిస్తే, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, ఇటలీలు నిలిచాయి. అయితే అమెరికా మినహా టాప్‌–10 జాబితాలో నిలిచినవన్నీ యూరప్, ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతానికి దేశాలే కావడం గమనార్హం. కరోనా సంక్షోభానికి ముందున్న పరిస్థితులు ఇంకా రానప్పటికీ అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా జరడం వల్ల ప్రజలు ధైర్యంగా ప్రయాణాలు చేయగలుగుతున్నారని, ప్రకృతి అందాలున్న దేశాల్లో పర్యటకానికి అధిక డిమాండ్‌ ఏర్పడిందని ఈ నివేదిక తెలిపింది. 2021లో ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల రాక 18 మిలియన్లు పెరిగినప్పటికీ, 2019 స్థాయిల కంటే 67 శాతం తక్కువగానే ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.

కరోనా లాక్ డౌన్ లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ప్రయాణం మరియు పర్యాటకం అందించే ముఖ్యమైన సహకారాన్ని తిరిగి నొక్కిచెప్పాయి అని WEF ఏవియేషన్, ట్రావెల్ అండ్ టూరిజం హెడ్ లారెన్ ఉప్పింక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచం మహమ్మారి నుండి బయటపడినప్పుడు, రాబోయే అనేక దశాబ్దాల పాటు ప్రయాణ మరియు పర్యాటక అనుభవం మరియు సేవలను అందించడానికి దేశాలు బలమైన మరియు స్థితిస్థాపక వాతావరణాన్ని నిర్మించడంలో పెట్టుబడి పెట్టాలి అని ఉప్పింక్ తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: India, Tourism, Travel

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు