INDIA DECLARES MUMBAI ATTACKS MASTERMIND HAFIZ SAEED SON HAFIZ TALHA SAEED A TERRORIST DETAILS HERE MKS
Hafiz Talha Saeed: హఫీజ్ సయీద్ కొడుకు హఫిజ్ తల్హా సయీద్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్
హఫీజ్ సయీద్ కొడుకు హఫిజ్ తల్హా సయీద్
ముంబై ఉగ్రదాడులకు సంబంధించి కేందం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకైన హఫిజ్ తల్హా సయీద్‌ను డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ఇండియా ప్రకటించింది.
స్వాతంత్ర భారత చరిత్రలో నెత్తుటి చరిత్రగా మిగిలిపోయిన ముంబై ఉగ్రదాడులకు సంబంధించి కేందం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కొడుకైన హఫిజ్ తల్హా సయీద్‌ను డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ఇండియా ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని నిబంధనల కింద తల్హా సయీద్ పేరును డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులో జాబితాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) చేర్చింది.
లష్కరే తొయిబా (ఎల్ఈటీ) సంస్థ సీనియర్ నేతగానూ, ఆ సంస్థ క్లెరిక్ విభాగం అధిపతిగాను తల్హా సయీద్ ఉన్నాడు. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, నిధుల వసూళ్లు, ఇండియాలో దాడులకు వ్యూహరచన, వాటి అమలుతో పాటు ఆప్ఘనిస్థాన్‌లో భారత్ ప్రయోజనాలను దెబ్బతీసే కార్యక్రమాల్లోనూ తల్హా చురుకుగా వ్యవహరిస్తున్నాడని ఎంహెచ్ఏ నోటిఫికేషన్ పేర్కొంది.
నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్‌గా ఉన్న హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ టెర్రరిస్టు నిరోధక కోర్టు శుక్రవారంనాడు రెండు కేసుల్లో 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అతని కుమారుడైన తల్హాను డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ఇండియా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడన్న ఆరోపణలపై నమోదైన రెండు కేసుల్లో అతడిని దోషి గా తేల్చిన కోర్టు, జైలు శిక్షతో పాటు సుమారు రూ. 1.38 లక్షల జరిమానాను కూడా విధించింది.
మరో 5 కేసుల్లో హఫీజ్‌కు ఇప్పటికే ఉన్న జైలు శిక్షను కలుపుకొంటే.. మొత్తం 68ఏళ్ల జైలు శిక్షను అతడు అనుభవించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పట్ జైలులో ఉన్నాడని.. అక్కడి నుంచే అతడిని కోర్టుకు తరలించామని అధికారులు తెలిపారు. 2008లో ముంబైపై జరిగిన దారుణ ఉగ్రదాడుల్లో హఫీజ్ కీలక సూత్రధారి. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తించిన అమెరికా, అతడి తలపై రూ.76 కోట్ల బహుమతిని ప్రకటించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.