ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల అంశంపై జనరల్ అసెంబ్లీ తాజాగా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ మరోసారి జమ్మూకాశ్మీర్ సమస్యను లేవనెత్తింది. దీంతో ఇండియా.. పాకిస్థాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇస్లామాబాద్ అసత్యాలను ప్రచారం చేయడానికి, మల్టిలేటర్ ఫోరమ్స్‌ను వేదికగా చేసుకుంటోందని, ఈ తీరును ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వ్యతిరేకించాలని సూచించింది. పాకిస్థాన్ అసత్యాలను ప్రచారం చేయడానికి తీరని ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది.
పాకిస్థాన్ అనవసర వ్యాఖ్యలు :
సభలో UN భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ అత్యున్నత సభను పాకిస్థాన్ దుర్వినియోగం చేయడంపై ప్రతిస్పందించడానికి భారతదేశం రైట్ ఆఫ్ రిప్లై హక్కును వినియోగించుకుంటోందని చెప్పారు. పాకిస్థాన్ తీరుపై ఇండియా స్పందన తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంపై చర్చించడానికి UNGA సమావేశమైతే.. పాకిస్థాన్ ప్రతినిధి మాత్రం సంబంధం లేకుండా.. జమ్మూకాశ్మీర్‌పై అనవసర వ్యాఖ్యలు చేశారని మాథుర్ అన్నారు.
భారత్‌లో భాగంగా జమ్మూకాశ్మీర్ :
పాకిస్థాన్ ప్రతినిధి కోసం మరోసారి జమ్మూకాశ్మీర్ విషయంలో స్పష్టత ఇస్తానని ప్రతీక్ మాథుర్ చెప్పారు. పాకిస్తాన్ ప్రతినిధి విశ్వసించే లేదా ఆశించే దానితో సంబంధం లేకుండా భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగంగా జమ్మూకాశ్మీర్ ఉందని ఆయన అన్నారు. అసత్యాలను ప్రచారం చేయడానికి మల్టిలేటరల్ ఫోరమ్‌లను దుర్వినియోగం చేసే పాకిస్థాన్ తీరు సరికాదని సూచించారు. ఈ చెడు అలవాటును అందరూ వ్యతిరేకించాలని మాథుర్ అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై ఆందోళన :
యుద్ధంలో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు సాయం చేయడంలో తన అచంచలమైన నిబద్ధతను ఇండియా తెలియజేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై భారతదేశం తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. UNSC అరియా ఫార్ములా సమావేశాన్ని ఉద్దేశించి UNలో భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సెలర్ R.మధు సూదన్ మాట్లాడుతూ.. భారతదేశానికి పొరుగు దేశంగా ఆఫ్ఘనిస్తాన్ దీర్ఘకాల భాగస్వామి అని చెప్పారు. తాలిబాన్ స్వాధీనం చేసుకోవడానికి ముందు, భారతదేశం ఆఫ్ఘనిస్థాన్‌లో అభివృద్ధి, పునర్నిర్మాణం, సామర్థ్య పెంపుదల లక్ష్యంగా 3 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చుపెట్టి.. ప్రాజెక్టులు, కార్యక్రమాలను అమలుచేసిందని తెలిపారు.
Viral video : ఓరి దేవుడో.. తల లేని చేప ఈదుతోందిగా.. వీడియోకి 23 లక్షల వ్యూస్
అభివృద్ధి మార్గాలను అన్వేషించాలి :
ఆర్థిక పతనాన్ని నిరోధించడం, ఆఫ్ఘనిస్తాన్‌లో పునరుద్ధరణ, అభివృద్ధికి అవకాశాలను అన్వేషించడం అవసరమని మధు సూదన్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎయిర్ ఫ్రైట్ కారిడార్లను, చాబహార్ పోర్ట్‌ను కూడా ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అయితే రాజకీయ పరిస్థితులలో మార్పుతో ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో న్యూ ఢిల్లీ విధానం ఎల్లప్పుడూ చారిత్రక స్నేహం, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలతో ప్రత్యేక సంబంధాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఈ విషయంలోనే భద్రతా మండలి తీర్మానం 2615 (2021)కి సపోర్ట్ ఇచ్చినట్లు తెలిపారు. ఇది 1988 ఆంక్షల పాలన నుంచి మానవతా వాదాన్ని అందించిందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, India pakistan, Jammu and Kashmir