Home /News /international /

INDIA CHINA DISPUTE CHINA POLICE ARRESTED A BLOGGER FOR DEFAMING SOLDIER HEROES OVER GALWAN VALLEY CLASH NK

India-China dispute: కుళ్లుబోతుల చైనా... నిజం చెప్పిన బ్లాగర్ అరెస్టు...

గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణ (File)

గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణ (File)

India-China dispute: వరెస్ట్ చైనా మరోసారి తన దుర్భుద్ధిని చాటుకుంది. నిజాన్ని బయటపెట్టిన బ్లాగర్‌ను బంధీ చేసింది. అతను ఏం చెప్పాడు? ఎందుకు అరెస్టు చేసింది?

    India-China dispute: చైనా పోలీసులు ఓ బ్లాగర్ (blogger)ను అరెస్టు చేశారు. ఇదివరకు ఇండియా-చైనా సరిహద్దైన గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు మరణించడంపై అతను కొన్ని కామెంట్లు రాశాడు. అంతే... ఆ 38 ఏళ్ల వ్యక్తిని బంధించేశారు. "అతను నిజాన్ని దాచేస్తున్నాడు." అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇలా అరెస్టైన వారిలో అతను ఏడోవాడు. ఇదివరకు ఆరుగురు ఇలాగే నిజాలు మాట్లాడగా... జైలుకు పంపింది చైనా ప్రభుత్వం. గతేడాది జూన్‌లో... లఢక్ తూర్పున సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో... భారత్, చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న డ్రాగన్ ప్రభుత్వం... ఈమధ్య తమ సైనికులు నలుగురు చనిపోయారని చెప్పుకొచ్చింది. ఆ నలుగురినీ మెచ్చుకుంటూ... ఓ వీడియో చేసి... అందులో ఘర్షణ విజువల్స్ మిక్స్ చేసింది.

    గత 45 ఏళ్లుగా గల్వాన్ లోయ సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. 2018లో చైనా ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. దాని ప్రకారం చైనీయులు ఎవరైనా సరే... సైనికులను, అమర సైనికులను విమర్శించకూడదు. తాజాగా ఈ చట్టంలో ఓ సవరణ చేసింది. దాని ప్రకారం.. సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఈ సవరణ వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. దాని ప్రకారం 3 ఏళ్ల దాకా జైలు శిక్ష ఉంటుంది. ఐతే... తాజాగా అరెస్టు చేసిన వ్యక్తికి ఈ కొత్త సవరణ వర్తించదు. ఫిబ్రవరి 19న అరెస్టైన అతన్ని క్యు (Qiu) అని పిలుస్తున్నారు.

    India-China, galwan clash video, china video, china footage, china news, dragon country, china army, eastern ladakh, China withdraws troops, చైనా ఆర్మీ, చైనా సైన్యం, చైనా ట్రూప్స్, గాల్వాన్ ఘర్షణ వీడియో,
    గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణ (File)


    చైనా బ్లాగ్ వీబో (Weibo)లో క్యూకి 25 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం అతని అకౌంట్ లేదు. దాన్ని ఏడాది పాటూ నిషేధించినట్లు వీబో గత వారం తెలిపింది.

    → ఇది కూడా చదవండి: 5 State Elections: మినీ సమరానికి సిద్ధమవుతున్న సీఈసీ... నేడు 5 రాష్ట్రాలతో మీటింగ్

    ఏ దేశంలోనైనా సైనికులను ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే... చైనాలో పరిస్థితి వేరు. అక్కడి ప్రభుత్వ తీరుతో విసుగెత్తిపోతున్న ప్రజలు... తమ అసహనాన్ని ఇలా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎదురు తిరిగిన ప్రతి వారినీ అరెస్టులు చేయడమే సంస్కృతిగా జిన్ పింగ్ ప్రభుత్వం ముందుకెళ్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: India-China

    తదుపరి వార్తలు