హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China: లడాఖ్ వద్ద బ్యానర్లతో చైనా సైనికుల నిరసన.. దలైలామా బర్త్ డే వేడుకలపై అభ్యంతరం

China: లడాఖ్ వద్ద బ్యానర్లతో చైనా సైనికుల నిరసన.. దలైలామా బర్త్ డే వేడుకలపై అభ్యంతరం

లఢాఖ్ లో చైనా బ్యానర్లు

లఢాఖ్ లో చైనా బ్యానర్లు

టిబెట్ పై భారత వైఖరి మారిందా..? తాజా పరిణమాలపై ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇటీవల దలైలామా పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన వేడుకలను వ్యతిరేకిస్తూ చైనా సైనికులు జెండాలు, బ్యానర్లు పట్టుకుని నిరసనలు తెలిపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...

  టిబెటన్ల మతగురువు దలైలామాపై తమకున్న ఉక్రోషాన్ని చైనీయులు మరోసారి బయటపెట్టారు. దలైలామా బర్త్ డే సెలబ్రేషన్స్ కి చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. లడాఖ్ లోని డెమ్ ఛుక్ ప్రాంతంలో సింధు నదికి అవతలివైపున చైనా సైనికులు, కొందరు పౌరులు చేత బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు. లడఖ్‌లో కొందరు గ్రామస్థులు దలైలామా జన్మదిన్నాన్ని ఘనంగా జరుపుకుంటుండగా, దెమ్చక్ ప్రాంతంలోని సింధు నదికి ఆవల చైనా సైనికులు, కొందరు పౌరులు బ్యానర్లు, చైనా జెండాలు చూపిస్తూ వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఈ నెల 6న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు పౌరులతో కలిసి ఐదు వాహనాల్లో ఆ దెమ్చక్ ప్రాంతానికి వచ్చిన చైనా సైనికులు దలైలామా జన్మదిన వేడుకలు జరుగుతున్న గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ సమీపానికి వచ్చి బ్యానర్లు చూపిస్తూ కనిపించారు. దలైలామా 86వ జన్మదినాన్ని పురస్కరించుకుని గతవారం భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దలైలామాతో నేరుగా మాట్లాడడం ఇదే తొలిసారి. దలైలామాకు ఫోన్ చేసి విషెస్ చెప్పినట్టు మోదీ మంగళవారం ఉదయం ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  ఓ వైపు తమ మత గురువు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటుంటే.. 5 ట్రక్కుల్లో వచ్చిన వీరు ఓ విలేజ్ కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఈ హడావుడి చేశారు. దలైలామా జన్మదిన వేడుకలు జరుపుకున్న గ్రామం దీనికి సమీపంలోనే ఉంది. చైనా సైనికులు సుమారు అరగంట సేపు అక్కడే ఉన్నారని.. వారు నిలబడిన భూభాగం మన ఇండియాదేనని కోయిల్ అనే గ్రామ పెద్ద సెవాంగ్ తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు భారత ఆర్మీ మాత్రం స్పందించలేదు.

  ఇదీ చదవండి: చైనా-అమెరికా జల జగడం.. యుద్ధ నౌకను తరిమేశామన్న చైనా.. తిప్పికొట్టిన అమెరికా

  సుమారు 10 రోజుల క్రితం కూడా స్థానికులు సోలార్ పంప్ ఏర్పాటు చేస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం ప్రకటించినట్టు సెవాంగ్ చెప్పాడు. ఇలా ఉండగా దలైలామా 86 వ జన్మ దినం సందర్బంగా ప్రధాని మోదీ ఆయనను గ్రీట్ చేస్తూ ట్వీట్ చేశారు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన దలైలామాకు శుభాకాంక్షలు చెప్పడం ఇదే మొదటిసారి. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. టిబెట్ పట్ల ఇండియ పాలసీ మారిందా అని అనుమానాలు పెరుగుతున్నాయి. తాను దలైలామాతో ఫోన్ లో మాట్లాడానని కూడా మోదీ పేర్కొన్నారు. చైనాతో ఇండియాకు గల సంబంధాలపై ఈ కొత్త పరిణామం ప్రభావం చూపుతుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు. టిబెటిన్ల పట్ల చైనా వైఖరిని, మన దేశ వైఖరిని ఈ సందర్బంగా పలువురు బేరీజు వేసుకుని చూశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: China, International news, Ladakh