సియాచిన్‌పై టూరిజమా? కుదరదు... పాకిస్తాన్ ఏడుపు

Siachen Tourism : సియాచిన్‌ గ్లేసియర్‌ వివాదాస్పద భూభాగం అంటున్న పాకిస్థాన్... దాన్ని భారత్ పర్యాటకం కోసం తెరిస్తే కుదరదని మెలిక పెడుతోంది.

news18-telugu
Updated: November 22, 2019, 7:33 AM IST
సియాచిన్‌పై టూరిజమా? కుదరదు... పాకిస్తాన్ ఏడుపు
సియాచిన్‌పై టూరిజమా? కుదరదు... పాకిస్తాన్ ఏడుపు
  • Share this:
Siachen Tourism : ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ భూమిగా గుర్తింపు పొందిన సియాచిన్ గ్లేసియర్‌పై పాకిస్థాన్ నోరు పారేసుకుంటోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అక్టోబర్ 21 కీలక ప్రకటన చేశారు. లఢక్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో భాగంగా... సియాచిన్ గ్లేసియర్‌పై పర్యాటకులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల సియాచిన్ గ్లేసియర్‌పై మైనస్ 60 డిగ్రీల వాతావరణంలో భారత సైన్యం ఎలా ఉండగలుగుతోందో? ఎలా దేశానికి రక్షణగా నిలుస్తోందో... పర్యాటకులకు స్వయంగా తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రకటనను పాకిస్థాన్ ఖండించింది. అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో పర్యాటకులకు ఎలా అనుమతిస్తారని పాకిస్థాన్ ప్రశ్నిస్తోంది. 2007లో భారత్ ఇలాంటి ప్రకటన చేసినప్పుడు కూడా పాకిస్థాన్ ఆందోళన చేసింది.

72 కిలోమీటర్ల పొడవైన గట్టకట్టిన యుద్ధ భూమి సియాచిన్ విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య 20 ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సియాచిన్ ప్రాంతంలో కాల్పులు జరుపుకోకూడదని 2003లో రెండు దేశాలూ ఒప్పుకున్నాయి. కానీ రెండు దేశాలూ... ఆ గ్లేసియర్ నుంచీ తమ తమ సైన్యాలను వెనక్కి పంపలేదు. సియాచిన్‌పై ఏ సైన్యం ఉంటే, ఆ సైన్యమే గెలిచే అవకాశాలు ఎక్కువ. ఈ విషయంలో ప్రతిసారీ ఓడిపోతున్న పాకిస్థాన్... ఎలాగైనా ఆ గ్లేసియర్‌ను దక్కించుకోవాలని యత్నిస్తోంది. అందువల్లే భారత ప్రయత్నాలను అడ్డుకుంటోంది.

 

Pics : అంజు శంకర్ డ్రెస్సులో అదరగొట్టిన అతుల్య
ఇవి కూడా చదవండి :

భార్యను చంపిన భర్త... రాత్రంతా శవంతోనే నిద్రఆర్టీసీ బస్సు బోల్తా... 25 మందికి గాయాలు

నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సాయంత్రంలోపు కీలక ప్రకటన

IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్... ఇవీ ప్రత్యేకతలు

Health : నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.

Published by: Krishna Kumar N
First published: November 22, 2019, 7:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading