INDIA AT UNSC MUMBAI TERROR ATTACK PERPETRATORS CONTINUE TO ENJOY PATRONAGE OF PAKISTAN PVN
India at UNSC : తగ్గేదే లే..ఆ విషయంలో మాత్రం పాక్ దే ప్రపంచ రికార్డు!
ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫొటో)
Pak Support To Terrorists : 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడి ఘటన ఇంకా ఎవరూ మరిచిపోలేదని..ముంబై ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్ లో అన్ని రకాలుగా మద్దతు అందిస్తోందని ఐరాస వేదికగా భారత్ తెలిపింది. ఐరాస భద్రతా మండలి గుర్తింపు పొందిన ఉగ్రవాదులు పాక్ లోనే ఎక్కువగా ఉన్నారని తెలిపింది.
India On Pakistan : ఐక్యరాజ్య సమితి వేదికపై దాయాది దేశం వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ..ఐరాస వేదికను పాకిస్తాన్(PAKISTAN) దుర్వినియోగం చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఐరాస వేదికను దుర్వినియోగం చేయడం పాకిస్థాన్‌కు ఇది మొదటిసారేం కాదని.. ఉగ్రవాదులకు ఎక్కడా లేని స్వేచ్ఛ లభిస్తున్న పాకిస్థాన్ స్థితిగతుల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో భారత శాశ్వత ప్రతినిధి ఆర్ మధుసూదన్ తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం…మద్దతు ఇవ్వడం ఆ దేశ చరిత్ర అని తెలిపారు. ఉగ్రవాదులకు సహకరించడంలో పాకిస్థాన్‌కు దశాబ్దాల చరిత్ర ఉందని విమర్శించారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు కోరుకుంటదని సృష్టం చేశారు.
సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాలనే అంశంపై మంగళవారం ఐరాస భద్రతా మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి ఆర్ మధుసూదన్...ఇదే వేదికపై భారత్ లక్ష్యంగా విష ప్రచారం చేసిన పాకి'స్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడి ఘటన ఇంకా ఎవరూ మరిచిపోలేదని..ముంబై ఉగ్రదాడి వ్యూహకర్తలకు పాకిస్థాన్ లో అన్ని రకాలుగా మద్దతు అందిస్తోందని మధుసూదన్ తెలిపారు. ఉగ్రవాదుల స్పాన్సర్ గా పాకిస్తాన్ ప్రపంచ దేశాల గుర్తింపు పొందిందన్నారు.
ఐరాస భద్రతా మండలి గుర్తింపు పొందిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోనే ఎక్కువగా ఉన్నారని మధుసూదన్ గుర్తుచేశారు. ఈ విషయంలో పాకిస్థాన్ కి ప్రపంచ రికార్డు ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల్లో ఏదో ఓ రూపంలో పాకిస్థాన్ హస్తం ఉంటోందన్నారు. ఒసామా బిన్‌లాడెన్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మాట్లాడుతుంటారని అన్నారు. పౌరుల రక్షణపై చర్చిస్తున్నామని, కానీ..ఇప్పుడు పాక్ దేశానికి ఉగ్రవాదుల నుంచే ముప్పు వస్తోందని తెలిపారు. జమ్మూ కశ్మీర్,లడఖ్ అంశంపై కూడా స్పందించిన మధుసూదన్..పాక్ ఆక్రమించిన ప్రాంతాలు భారత్ భాగమేనని, అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలను వెంటనే వాటి నుంచి ఖాళీ చేయాలని తేల్చిచెప్పారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు కోరుకుంటదని సృష్టం చేశారు. గతంలో జరిగిన ఒప్పందాలకు కట్టుబడి ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉన్నట్లు మధుసూదన్ సృష్టం చేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.