భారత్‌లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను ఇక్కడికి పంపించేయండి : బంగ్లాదేశ్

జాతీయ పౌరసత్వ నమోదు చట్టాన్ని దేశంలో అమలుచేయబోతున్న నేపథ్యంలో.. భారత్‌లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయుల జాబితాను తమకు పంపించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ భారత ప్రభుత్వాన్ని కోరారు.

news18-telugu
Updated: December 16, 2019, 11:03 AM IST
భారత్‌లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులను ఇక్కడికి పంపించేయండి : బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకె అబ్దుల్ మొమెన్ (Image : Facebook)
  • Share this:
జాతీయ పౌరసత్వ నమోదు చట్టాన్ని దేశంలో అమలుచేయబోతున్న నేపథ్యంలో.. భారత్‌లో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయుల జాబితాను తమకు పంపించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఆ జాబితాను తమకు అందిస్తే.. అందులో ఉన్న తమ దేశీయులను తిరిగి బంగ్లాదేశ్‌కి ఆహ్వానిస్తామని చెప్పారు. ఎన్‌ఆర్‌సీ భారత అంతర్గత వ్యవహారమని, దానివల్ల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ప్రభావితం కావని అన్నారు. ఇక బంగ్లాదేశ్‌లోకి చొరబడే అక్రమ వలసదారులను బయటకు పంపించేస్తామని చెప్పారు. వారు బంగ్లాదేశ్ నుండి గతంలో వలస వెళ్లినవారైతే తప్ప మినహాయింపు ఉండదన్నారు. ఇక భారత పర్యటనను రద్దు చేసుకోవడానికి తన బిజీ షెడ్యూలే కారణమని పేర్కొన్నారు. అదే రోజు బంగ్లాదేశ్‌లో తాను పాల్గొనాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉండటంతో పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు.

First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు