విదేశాల్లో చదువుకోవాలని, వర్క్ (Work) చేయాలని చాలా మంది కోరుకుంటారు. అత్యుత్తమ ప్రమాణాలు, అధిక వేతనాలు చెల్లించే దేశాలను సెలక్ట్ చేసుకుంటారు. ఇటీవల చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్, జాబ్స్ కోసం బ్రిటన్ (Britain) వెళ్తున్నారు. అయితే పరిమితులు, నిబంధనల కారణంగా కొంత మందికే ఆ అవకాశం లభిస్తోంది. ఇప్పుడు మరింత మంది భారతీయులకు అవకాశాలు కల్పించేందుకు యూకే ప్రభుత్వం (UK Government) ముందుకొచ్చింది. రెండేళ్లపాటు యూకేలో ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకు భారత్, బ్రిటన్ సంయుక్తంగా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్(YPS)ను తీసుకొస్తున్నాయి.
2021 మేలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అప్పటి UK హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ ఢిల్లీలో ‘మైగ్రేషన్, మొబిలిటీ పార్టనర్‌షిప్’పై సంతకం చేశారు. ఇందులో YPS ఒకటి. తాజాగా 2023 జనవరి 9న UKలోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి, UK హోమ్ ఆఫీస్ శాశ్వత కార్యదర్శి మాథ్యూ రైక్రాఫ్ట్.. YPS డాక్యుమెంట్స్‌పై సంతకం చేసి, ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు.
* 3 వేల మందికి అవకాశం
భారతదేశం, UK మధ్య యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (YPS) ద్వారా వీసా నిబంధనలు సడలించారు. ఇంతకు ముందే ఈ హోదా అనుభవిస్తున్న ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జపాన్, తైవాన్, ఐస్‌లాండ్, శాన్ మారినో, మొనాకో, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి కొన్ని దేశాల సరసన ఇండియా కూడా చేరింది. యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ద్వారా 18-30 సంవత్సరాల వయస్సు గల 3,000 మంది గ్రాడ్యుయేట్స్ UKలో రెండేళ్లు నివసించవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. ఇందుకు స్పాన్సర్ లేదా చేతిలో ఉద్యోగం అవసరం లేదు. జపాన్ మినహా ఈ పథకాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం ఇండియా కావడం విశేషం.
* బ్యాలెట్ ద్వారా ఎంపిక
యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ టూ- టైర్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఆస్ట్రేలియా నుంచి 30,000 మంది, కెనడా (6,000), మొనాకో (1,000), న్యూజిలాండ్ (13,000), శాన్ మారినో (1,000), ఐస్‌లాండ్ (1,000) నేరుగా వీసా దరఖాస్తు చేసుకోవచ్చు. జపాన్ (1,500), దక్షిణ కొరియా (1,000), హాంకాంగ్ (1,000), తైవాన్ (1,000), భారతదేశం (3,000) నుంచి దరఖాస్తులు బ్యాలెట్ ద్వారా ఎంపిక చేస్తారు.
భారతదేశానికి సంబంధించిన నిర్దిష్ట వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే ఇండియా కూడా సెలక్షన్-బై-బ్యాలెట్ దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్ తరహా విధానం అనుసరించే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌పై ఎక్కువమంది భారతీయులు ఆసక్తి చూపే అవకాశాలు ఉండటంతో 3,000 మందికి అవకాశం కల్పించారు. దరఖాస్తుదారులు సాధారణంగా జనవరి, జులై నెలల్లో సంవత్సరానికి రెండుసార్లు ఇమెయిల్ ద్వారా బ్యాలెట్‌లోకి ఎంటర్ కావచ్చు.
ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ జాబ్స్‌కు అప్లై చేసుకున్నారో లేదో చెక్ చేయండి..
* ఫిబ్రవరి 28న ఇండియా నుంచి దరఖాస్తులు?
2023 యూత్ మొబిలిటీ స్కీమ్ మొదటి బ్యాలెట్ జనవరి 17 మంగళవారం ప్రారంభమవుతుంది. జనవరి 19 గురువారం తో ముగుస్తుంది. ఇతర దేశాల బ్యాలెట్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నందున, 2023 జనవరి విడతలో భారతదేశం చేరుతుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి.
ఢిల్లీలో జరిగిన 15వ ఇండియా-యూకే విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల(ఎఫ్‌ఓసి) తర్వాత విడుదల చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ప్రకటన ప్రకారం.. ఈ పథకం ఫిబ్రవరి 28న మొదలవుతుంది. భారత హైకమిషన్‌లోని దౌత్యవేత్తలు పథకం వివరాలు, అర్హత, దశల వారీ దరఖాస్తు విధానాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Britain, India, International news, National News, Uk