భారత్, పాకిస్తాన్ చరిత్రాత్మక ఒప్పందం..

భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా వరకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.

news18-telugu
Updated: October 24, 2019, 2:05 PM IST
భారత్, పాకిస్తాన్ చరిత్రాత్మక ఒప్పందం..
కర్తార్‌పూర్ కారిడార్‌ ఒప్పందంపై సంతకాలు చేస్తున్న రెండు దేశాల ప్రతినిధులు (Image:ANI)
  • Share this:
భారత్, పాకిస్తాన్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. కర్తార్‌పూర్ కారిడార్‌కు సంబంధించి ఇరుదేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. భారీ హడావిడి లేకుండా కేవలం భారత్, పాకిస్తాన్ ‘జీరో లైన్’ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి ఈ కార్యక్రమం అక్టోబర్ 22న జరగాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ రోజు జరిగింది. ఈ ఒప్పందం కోసం పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ నేతృత్వంలోని బృందం హాజరైంది. కర్తార్‌పూర్ కారిడార్ ఒప్పందం గురించి, గురనానక్ దేవ్ 550 జయంతి ఉత్సవాల కోసం రెండు దేశాలు అత్యున్నత స్థాయి చర్చలు జరిపాయి.

Kartarpur Corridor Agreement Copy
భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా వరకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల అవతల ఈ గురుద్వారా ఉంది. భారత యాత్రికులకు ఎలాంటి వీసా లేకుండా గురుద్వారాకు అనుమతిస్తారు. కాకపోతే కర్తార్‌పూర్ సాహిబ్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అయితే, పాకిస్తాన్ మాత్రం 20 డాలర్ల సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంది.

First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>