కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో పాకిస్థాన్‌లో కలకలం... అణు యుద్ధం తప్పదా?

ప్రతీకాత్మక చిత్రం

India and Pakistan Nuclear War : ఎప్పుడూ శాంతిని కోరుకునే దేశం ఇప్పుడు రూల్స్ మార్చేసుకుంటానంటోంది. అవసరమైతే అణుదాడి చేస్తామంటోంది. ఫలితంగా... ఆసియా దేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌ ప్రజల్లో అణు యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి.

 • Share this:
  India and Pakistan Nuclear War : ఆగస్టులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే... అవసరమైతే... ముందుగా భారతే అణు బాంబు వేస్తుందన్నారు. అప్పట్లో అదో సెన్సేషన్ అయ్యింది. తాజాగా సెప్టెంబర్ 22న ఆయనే మరో ప్రకటన చేశారు. మరోసారి పాకిస్థాన్ యుద్ధానికి దిగితే... ఈసారి అది మరిన్ని ముక్కలవుతుందనీ, ఆ విభజనను ఆపే శక్తి ఎవరికీ ఉండదని అన్నారు. ఇదే సమయంలో... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కలకలం రేపే వ్యాఖ్య చేశారు. యుద్ధం వస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండదు అని అన్నారు. ఈ ప్రకటనలు పాకిస్థాన్ ప్రజల్లో భయాల్ని పెంచుతున్నాయి. రెండు దేశాల మధ్యా యుద్ధం వస్తుందేమోనని కలవరపడుతున్నారు పాకిస్థాన్ ప్రజలు. ఎందుకంటే ఈసారి యుద్ధం వస్తే... అది అణు యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉంటుందనీ, భారతే ముందుగా అణు బాంబు వేస్తుందనే టెన్షన్లు అక్కడ పెరుగుతున్నాయి. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని బట్టీ... భారత్, పాకిస్థాన్‌పై అణు బాంబు వేస్తుందనీ, ఫలితంగా పాకిస్థాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టే... ఆయన ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండదని అన్నారన్న అర్థాన్ని వినిపిస్తున్నారు పాకిస్థాన్ ప్రజలు.


  ప్రస్తుతం రెండు దేశాల మధ్యా ఏమాత్రం సఖ్యత కనిపించట్లేదు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ పాకిస్థాన్ కారాలూ, మిరియాలూ నూరుతోంది. ఉగ్రవాదుల్ని రెచ్చగొడుతోంది. సరిహద్దుల్లో చొరబాట్లను పెంచేందుకు యత్నిస్తోంది. తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ప్రధాని మోదీ... పాకిస్థాన్ గగనతలాన్ని వాడుకునే అనుమతి ఇవ్వాలని కోరితే... పాకిస్థాన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇలా... రెండు దేశాల మధ్యా చిచ్చు నానాటికీ పెరుగుతోంది. ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌తో ఇదే విషయంపై చర్చించబోతున్నారు. అలాగే పాకిస్థాన్‌కి ఆర్థిక సాయాన్ని కోరుతున్నారు.  అణు యుద్ధం అసాధ్యమే : నిపుణులు మాత్రం అణ్వస్త్ర యుద్ధం జరిగే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. ఎందుకంటే... అణు యుద్ధం జరిగే పరిస్థితే వస్తే... ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోవనీ, అటు పాకిస్థాన్, ఇటు ఇండియా రెండింటినీ వారించి... వెనక్కు తగ్గేలా చేస్తాయని అంటున్నారు. యుద్ధం చేసే పరిస్థితుల్లో పాకిస్థాన్ లేదనీ... అలాంటి దేశం భారత్‌తో పెట్టుకునేంత సాహసం చెయ్యదని అంటున్నారు. భారత్‌తో జరిగిన గత నాలుగు యుద్ధాల్లో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్థాన్... అప్పటి కంటే ఎన్నో రెట్లు బలంగా ఉన్న ఇండియాతో ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వి... తీవ్ర నష్టాన్ని చూసేంత తప్పుడు నిర్ణయం తీసుకోదని అంటున్నారు.

  పాకిస్థాన్ ప్రజల్లో మాత్రం... భయాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాళ్లు టెన్షన్ పడుతున్నారు. శాంతియుతంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని భారత్ కుండబద్ధలు కొడుతోంది.

   

  ఇవి కూడా చదవండి :


  Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


  Dussehra 2019 : దసరా ప్రత్యేకతలేంటి? ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది?

  Health Tips : వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు...

  First published: