news18-telugu
Updated: July 7, 2019, 11:09 AM IST
విమానం వివాదాస్పద సందేశం
తాజాగా శనివారం టీమిండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగింది. లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న స్డేడియంపై ఓ విమానం చక్కర్లు కొడుతూ.. హల్ చల్ చేసింది. మ్యాచ్ జరుగుతుండగా మైదానం మీదుగా ఓ చిన్న విమానం వెళ్లింది. అయితే, ఆ విమానం వెళ్తూ వెళ్తూ ప్రదర్శించిన ఓ బ్యానర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. "కశ్మీర్లో భారత్ మారణహోమం ఆపాలి, కశ్మీర్ కు విమోచన కల్పించాలి" ( "India stop Genocide and Free Kashmir") అనే నినాదం రాసి ఉన్న బ్యానర్‌తో విమానం వెళ్లింది. దీంతో ఆ విమానం వెళ్లడం పట్ల ఐసీసీ స్పందించింది. ఇలాంటి చర్యలను అంగీకరించబోమని, ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించామని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
వరల్డ్ కప్ లో నిర్వహణ లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య లీడ్స్ లోఈ టోర్నీలో జరిగిన ఇలాంటి ఘటన కొన్నిరోజుల క్రితం కూడా వరల్డ్ కప్ 2019లో చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు మ్యాచ్ ఆడుతుండగా, ఓ విమానం జస్టిస్ ఫర్ బెలూచిస్థాన్ అని రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ మైదానం చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో మైదానంలో ఉన్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు కూడా బాహాబాహీకి దిగారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
July 7, 2019, 10:59 AM IST