Video : ఆ పోలీసులు రియల్ హీరోలు.. బేబీని ఎలా కాపాడారో చూడండి..

పోలీసులు సకాలంలో స్పందించి తన కుమారుడిని కాపాడినందుకు ఆ తల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: October 25, 2019, 9:30 PM IST
Video : ఆ పోలీసులు రియల్ హీరోలు.. బేబీని ఎలా కాపాడారో చూడండి..
చిన్నారిని రక్షించడానికి పోలీసుల ప్రయత్నాలు
  • Share this:
స్నాక్స్‌ గొంతుకు అడ్డుపడి శ్వాస తీసుకోలేకపోయిన ఓ చిన్నారిని పోలీసులు కాపాడారు. ఊపిరి ఆగిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ చిన్నారి తల్లి తీవ్ర ఆందోళన చెందింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులను పిలిచింది. దీంతో బాబును చేతుల్లోకి తీసుకున్న పోలీసులు.. వెన్నుపై తట్టడం మొదలుపెట్టారు.అయినా బాబులో చలనం రాకపోయేసరికి.. గుండెపై చేతులతో ఒత్తడం మొదలుపెట్టారు. బాబుకు ఏమైందో తెలియక ఆ చిన్నారి తల్లి అప్పటికే కన్నీరుమున్నీరవుతోంది. అయితే పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించి..ఆ చిన్నారి శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాడు.దీంతో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చాడు. గోల్డ్ ఫిష్ క్రాకర్ అనే స్నాక్ తింటుండగా.. అది గొంతుకు అడ్డుపడటంతో అతని ఊపిరి ఆగిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించి తన కుమారుడిని కాపాడినందుకు ఆ తల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published by: Srinivas Mittapalli
First published: October 25, 2019, 9:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading