పోర్న్ వైపు నడిపిస్తున్న పేదరికం.. డబ్బు కోసం కెమెరా ముందు నగ్నంగా..

ప్రపంచాన్ని పోర్న్ ఇండస్ట్రీ పట్టి పీడిస్తుండగా, పేదరికం అనే జబ్బు.. మహిళలను ఆ వైపు తిప్పుతోంది. ముఖ్యంగా వీడియో చాట్ పేరిట కెమెరా ముందు నగ్నంగా తమ శరీరాన్ని ప్రదర్శించేలా చేస్తోంది.

news18-telugu
Updated: July 29, 2019, 3:21 PM IST
పోర్న్ వైపు నడిపిస్తున్న పేదరికం.. డబ్బు కోసం కెమెరా ముందు నగ్నంగా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డబ్బు ఏ పనైనా చేయిస్తుంది.. అందుకు మహిళల శరీరం మినహాయింపు కాదు.. ఇప్పటికే ప్రపంచాన్ని పోర్న్ ఇండస్ట్రీ పట్టి పీడిస్తుండగా, పేదరికం అనే జబ్బు.. మహిళలను ఆ వైపు తిప్పుతోంది. ముఖ్యంగా వీడియో చాట్ పేరిట కెమెరా ముందు నగ్నంగా తమ శరీరాన్ని ప్రదర్శించేలా చేస్తోంది. ప్రస్తుత పోర్న్ మార్కెట్‌లో 24/7 నడిచేది.. వెబ్ క్యామ్ సెక్సే. పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాల్లో ఎక్కువ మంది క్లయింట్లను కలిగి ఉన్న వెబ్ క్యామ్ సెక్స్ మార్కెట్.. కేవలం సంవత్సర కాలంలోనే 29 శాతం పెరిగింది. వ్యూయర్ల సంఖ్య అమాంతం పెరిగింది. డైరెక్టుగా వ్యభిచారం చేసే వాళ్లకు కొన్ని దేశాల్లో హక్కులు ఉన్నాయి. అయితే, వెబ్ క్యామ్ సెక్స్‌లో పాల్గొనే మహిళలు మాత్రం నరకం అనుభవిస్తున్నారు. క్లయింట్లు నీచంగా తిట్టినా, సూటి పోటి మాటలతో గుచ్చినా ఆ బాధల్ని దిగమింగుకుని, డబ్బుల కోసం అవన్నీ భరించాల్సి వస్తోంది.

పిల్లల్ని పోషించేందుకు చాలా మంది మహిళలు ఈ దారిని ఎంచుకున్నట్లు వెబ్ క్యామ్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. గంటకు కొత్త మొత్తం డబ్బు ఇచ్చేలా పలు పోర్న్ వెబ్‌సైట్లు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని వెల్లడించింది. బయటి ప్రపంచంలోకి వెళ్లి పని చేస్తే సామర్థ్యం, ఆరోగ్యం లేక వెబ్ క్యామ్ సెక్స్‌ వైపు అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించింది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తమకు కొంత ఊరటనిచ్చిందని, మహిళలుగా తమకు డబ్బులు సంపాదించుకునే మార్గం దొరికిందని వెబ్ క్యామ్ సెక్స్ చేస్తున్న కొందరు మహిళలు వెల్లడించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 29, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading