మరికొన్ని గంటల్లో అమెరికాలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాత్రి 11 గంటలకు అమెరికా కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ప్రమాణస్వీకార మహోత్సం జరగనుంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, మొట్ట మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాషింగ్టన్లో జరిగే ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు తరలిరానున్నారు. వారి కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ చెఫ్ రాబర్ట్ డోర్సీ అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. స్టార్టర్లు, స్వీట్లతో ఘుమఘుమలాడే ఆహార పదార్థాలను వారికి వడ్డించనున్నారు. ఈ మెనూలో కమలా హ్యారిస్‌కు ఎంతో ఇష్టమైన సీఫుడ్ 'గంబో' కూడా ఉంది.
షెల్ పిష్, కాస్పికం, ఉల్లిపాయలతో తయారుచేసే చిక్కటి సూపే ఈ గంబో. అంతేకాదు ఇది లూసియానా స్టేట్ అధికారిక వంటకం. తనకు కూడా ‘గంబో’ అంటే చాలా ఇష్టమని చెఫ్ రాబర్ట్ డోర్సీ తెలిపారు. తన చిన్నతనంలో కమలా హారిస్‌తో కలిసి చదువుకున్నానని వెల్లడించాడు.
డిన్నర్ మెనూ
స్టార్టర్స్:
పాంకో క్రస్టెడ్ క్రాబ్ కేక్స్
ఆర్గానిక్ కోస్టల్ గ్రీన్స్
కాజున్ రిమోలెడ్
మెయిన్ డిష్:
సాసేన్ గంబో
లూసియానా లవ్
డీప్ అంబర్ రౌక్స్
స్వీట్ పెప్పర్స్
బ్లాకెన్డ్ చికెన్
జలాపెనో
తాజా ఎండ్రకాయలు
రొయ్యలు
హాట్ లింక్స్
ఓక్రా,
వైట రైస్
స్వీట్లు
బనానా రైసిన్ బ్రెడ్ పుడ్డింగ్
బౌర్బోన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Joe Biden, Kamala Harris, Us news