హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Layoff : ఐటీలో "లే ఆఫ్" సీజన్..10వేల ఉద్యోగులను తొలగించాలని గూగుల్ నిర్ణయం!

Layoff : ఐటీలో "లే ఆఫ్" సీజన్..10వేల ఉద్యోగులను తొలగించాలని గూగుల్ నిర్ణయం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google Layoff : ప్రస్తుతం ఐటీ(IT) రంగంలో లే-ఆఫ్స్(Layoffs) ట్రెండ్ నడుస్తోంది. మాంద్యం భయాల నేపథ్యంలో ఆదాయం తగ్గుతుందనే అంచనాకు వచ్చిన దిగ్గజ టెక్ కంపెనీలు వ్యయం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ముందుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Google Layoff : ప్రస్తుతం ఐటీ(IT) రంగంలో లే-ఆఫ్స్(Layoffs) ట్రెండ్ నడుస్తోంది. మాంద్యం భయాల నేపథ్యంలో ఆదాయం తగ్గుతుందనే అంచనాకు వచ్చిన దిగ్గజ టెక్ కంపెనీలు వ్యయం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ముందుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. మెటా( Meta),ట్విట్టర్(Twitter),అమెజాన్(Amazon)కంపెనీలు ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలోకి గూగుల్ కంపెనీ(Google) చేరింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్(Alphabet)త్వరలో 10,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హెడ్జ్ ఫండ్స్ ఒత్తిడి, మార్కెట్ పరిస్థితులు, ఖర్చు తగ్గింపు కారణంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పనితీరు సరిగా లేని 10 వేల మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించాలని గూగుల్ నిర్ణయించినట్లు తెలిసింది. గూగుల్ మేనేజర్స్ ప్రస్తుతం "Poor Performing Employees"ను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.

దాదాపు 6 శాతం మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించాలని గూగుల్ నిర్ణయించినట్లు తెలిసింది. ర్యాంకింగ్ సిస్టమ్ డేటా ఆధారంగా తక్కువ ర్యాంకింగ్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించాలని గూగుల్ నిర్ణయించింది. బ్రిటన్ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హాన్ ఆల్ఫాబెట్‌కు రాసిన మెయిల్ లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా, ఆల్ఫాబెట్ ఉద్యోగులకు ఇతర టెక్ దిగ్గజాల కంటే చాలా ఎక్కువ వేతనం లభిస్తుందని, ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. Googleలో మొత్తం ఉద్యోగులు 1,87,000 మంది ఉన్నారు. ఆల్ఫాబెట్‌ లో దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు ఉండగా, వారి వార్షిక ఆదాయం రూ. 2.41 కోట్లుగా ఉంది. ఈ జీతం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు చెల్లిస్తున్న దానికంటే దాదాపు 70శాతం ఎక్కువ అని హోన్ తన లేఖలో తెలిపారు. అమెరికాలోని 20 అతిపెద్ద టెక్ కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్ దాని ఉద్యోగులకు దాని పోటీదారుల కంటే 153శాతం ఎక్కువ చెల్లిస్తోందని క్రిస్టోఫర్ హాన్ తెలిపారు.

Electricity Bill: విద్యుత్ కనెక్షన్ లేకున్నా భారీగా కరెంట్ బిల్లు.. రూ.60వేల వరకు కట్టాలని ప్రజలకు నోటీసులు..

మరోవైపు, గూగుల్ ఆదాయానికి ఇటీవల భారీగా గండిపడింది. మూడవ త్రైమాసికంలో 13.9 బిలియన్ డాలర్ల నికర లాభం వచ్చినట్లు గూగుల్ ప్రకటించింది. అయితే గతేడాది మూడవ త్రైమాసికంతో పోల్చితే గూగుల్ కంపెనీ లాభాలు 27 శాతం పడిపోయాయి. గూగుల్‌కు మొత్తంగా.. 6 శాతం ఆదాయం పెరిగి 69.1 బిలియన్ డాలర్లు ఆర్జించినప్పటికీ లాభంలో తగ్గుదల మాత్రం స్పష్టంగా కనిపించింది. Alphabet సంస్థ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవాలన్న నిర్ణయానికి కారణం ఈ పరిణామం అయి ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

First published:

Tags: Google, Layoffs

ఉత్తమ కథలు