అక్కడ లీటర్ పాలు రూ.140.. పెట్రోల్ కంటే భగభగ

పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.113 కాగా, డీజిల్ రూ.91కి విక్రయిస్తున్నారు. కానీ పాలు మాత్రం లీటర్ ధర రూ.140కి చేరుకుంది.

news18-telugu
Updated: September 11, 2019, 2:45 PM IST
అక్కడ లీటర్ పాలు రూ.140.. పెట్రోల్ కంటే భగభగ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్‌లో పాల ధరలు మండిపోతున్నాయి. పాకిస్తాన్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. మొహర్రం సందర్భంగా ఈ పరిస్థితి తలెత్తింది. కరాచీ, సింధ్ ప్రావిన్స్‌లో లీటర్ పాలు రూ.140కి చేరుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది. ఓ రకంగా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ ధరల కంటే కూడా పాల ధరలు ఎక్కువ కావడం విశేషం. పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.113 కాగా, డీజిల్ రూ.91కి విక్రయిస్తున్నారు. ‘కరాచీలో సడన్‌గా డిమాండ్ పెరగడంతో లీటర్ పాలు రూ.120 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నాం.’ అని ఓ దుకాణం యజమాని తెలిపాడు.

మొహర్రం సందర్భంగా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం రోడ్ల పక్కన దుకాణదారులు పెద్ద ఎత్తున పాలు, పండ్ల రసాలు, మంచి నీళ్లు వంటివి ఏర్పాటు చేస్తుంటారు. దీంతో పాల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా పాలు అందుబాటులో లేకపోవడంతో ధర పెరిగింది. ‘మేం ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా ఇలా పాలు ఇస్తుంటాం. ధరలు పెరిగినా సరే మేం ఆనవాయితీని కొనసాగించాం. నా జీవితంలో పాల రేటు ఇంతగా ఉండడం ఎప్పుడూ చూడలేదు.’ అని ఓ దుకాణదారు తెలిపాడు. పాల ధరలను కంట్రోల్ చేసే అధికారులు మిన్నకుండిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వారు చెబుతున్నారు. అయితే, కరాచీలోని కమిషనర్ కార్యాలయంలో మాత్రం పాల ధర రూ.94గానే పేర్కొనడం గమనార్హం.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 11, 2019, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading