PM Modi: ఇండోనేషియాలో (Indonesia)ని బాలిలో G20 సమ్మిట్(G20 Summit) జరుగుతున్న విషయం తెలిసిందే. బాలిలో మూడు రోజులపాటు ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ షెడ్యూల్‌పై చాలా వార్తలు వచ్చాయి. ఆయన కలిసే వివిధ దేశాలకు చెందిన నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. అయితే చైనా అధ్యక్షుడిని మోదీ కలుస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు. ఈ విషయంపై ఇరు దేశాల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఆసక్తికరంగా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్(XI Jinping) షేక్‌హ్యాండ్స్ చేసుకొని, కొంత సేపు మాట్లాడారు. బాలిలో G20 సమ్మిట్‌కు హాజరైన నాయకులకు ఏర్పాటు చేసిన ఫార్మల్ డిన్నర్లో మోదీ, జిన్‌పింగ్ కలిశారు. రెండేళ్ల క్రితం లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభన ప్రారంభమైన తర్వాత వీరిద్దరు బహిరంగంగా కలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
* నవ్వుతూ పలకరించిన మోదీ
ఇండోనేషియా ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లోని ఫుటేజీలో.. జిన్‌పింగ్, అతని భార్య పెంగ్ లియువాన్ ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడోతో మాట్లాడటానికి సమీపంలో ఆగి ఉన్నప్పుడు, యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో మోదీ మాట్లాడుతున్నట్లు కనిపించింది. అనంతరం మోదీ తన సీటు నుంచి లేచి, నవ్వుతూ జిన్‌పింగ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడం కనిపించింది. ఒక ఇంటర్ప్రెటర్తో ఉన్న మోదీ, ఆ తర్వాత జిన్‌పింగ్‌తో కొన్ని నిమిషాలు మాట్లాడారు. కొంతసేపటికి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మోదీ, జిన్‌పింగ్ చుట్టూ పలువురు వ్యక్తులు గుమిగూడి, తమ మొబైల్ ఫోన్ కెమెరాలతో ఆ క్షణాన్ని బంధించడం ప్రారంభించారు.
PM Modi: G20 సదస్సు సందర్భంగా జో బైడెన్, రిషి సునాక్‌తో మాట్లాడిన మోదీ
* ఇరు దేశాల మీడియా నుంచి కనిపించని స్పందన
గరుడ విస్ను కెంకనా కల్చరల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనపై భారతీయ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. చైనా వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం. ఈ విషయం గురించి తెలిసిన కొందరు వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ.. ఇండోనేషియా అధ్యక్షుడు నిర్వహించిన G20 విందుకు హాజరైన ప్రధాన మంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మర్యాదపూర్వకంగా కలిశారని, కొంతసేపు మాట్లాడుకున్నారని చెప్పారు. సెప్టెంబర్ 15-16 మధ్య ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమ్మిట్‌కు మోదీ, జిన్‌పింగ్ హాజరయ్యారు. అయితే ఇరువురి మధ్య ఎలాంటి పలకరింపులు జరగలేదు. G20 సమ్మిట్ సందర్భంగా అధికారిక ద్వైపాక్షిక సమావేశానికి ఇరుపక్షాలు ఎలాంటి ప్రయత్నం చేయలేదని కొందరు తెలిపారు.
* గాల్వాన్ ఘటనతో దెబ్బతిన్న సంబంధాలు
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)లోని లడఖ్ సెక్టార్లో ప్రతిష్టంభన ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం- చైనా సంబంధాలు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2020 జూన్‌లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఫలితంగా 20 మంది భారతీయ సైనికులు, కనీసం నలుగురు చైనా సైనికులు మరణించారు. 1975 తర్వాత LAC వెంట సంభవించిన మొదటిసారి ఇరు పక్షాల సైనికులు ప్రాణాలు వదిలారు. సరిహద్దు ఉద్రిక్తతలను మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి వేరు చేయాలని చైనా పేర్కొంది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొనే వరకు భారత్-చైనా సంబంధాలను సాధారణీకరించలేమనే వైఖరిని జైశంకర్ కొనసాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, International news, PM Narendra Modi, Xi Jinping