చైనాకు మరో దెబ్బ.. డ్రాగన్ కంపెనీకి భారీ షాక్ ఇచ్చిన బ్రిటన్...

యూకేలో 5జీ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి హువాయ్ సంస్థ టెక్నికల్‌ సేవలు అందిస్తోంది. ఆ సేవలను దశలవారీగా కట్ చేయాలని బ్రిటన్ నిర్ణయించింది.

news18-telugu
Updated: July 5, 2020, 2:20 PM IST
చైనాకు మరో దెబ్బ.. డ్రాగన్ కంపెనీకి భారీ షాక్ ఇచ్చిన బ్రిటన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
59 చైనీస్ యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసిన తర్వాత డ్రాగన్ కంట్రీకి మరో షాక్ తగిలింది. అయితే, ఈసారి షాక్ బ్రిటన్ నుంచి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. యూకేలో 5జీ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి చైనాకు చెందిన హువాయ్ సంస్థ టెక్నికల్‌ సేవలు అందిస్తోంది. ఆ సేవలను దశలవారీగా కట్ చేయాలని బ్రిటన్ నిర్ణయించింది. భద్రతా కారణాల రీత్యా ఈ ఏడాది చివరి నాటికి వీలున్నంత వరకు తీసేయాలని యూకే భావిస్తోంది. సండే టెలిగ్రాఫ్ కథనం ప్రకారం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పాలసీలో మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు. చైనా కంపెనీ వల్ల భద్రతా పరమైన సమస్యలు వస్తున్నాయని స్థానిక జీసీహెచ్‌క్యూ సంస్థ అంచనా వేసింది. అమెరికా విధించిన ఆంక్షల వల్ల హువాయ్ కంపెనీ కొన్ని నమ్మదగని పరికరాలు వాడుతోందని, దీని వల్ల సైబర్ సెక్యూరిటీకి రిస్క్ పెరిగే ప్రమాదం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడినట్టు సండే టెలిగ్రాఫ్ కథనంలో ఉందని పేర్కొంది. ఈ క్రమంలో చైనా కంపెనీ హువాయ్‌‌ను చాలా తక్కువ స్థాయికి పరిమితం చేయాలని యూకే భావిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 5, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading