హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan Politics : పాక్ చరిత్రలో ఇవాళ ఆ రికార్డు సృష్టించనున్న ఇమ్రాన్ ఖాన్

Pakistan Politics : పాక్ చరిత్రలో ఇవాళ ఆ రికార్డు సృష్టించనున్న ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ చాలా కాలంగా విదేశీ నిధుల ఆరోపణలను ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీలు పాకిస్థాన్‌లో విదేశాల నుంచి విరాళాలు సేకరించలేవు. అలా చేస్తే పార్టీలను నిషేధించవచ్చు.

ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ చాలా కాలంగా విదేశీ నిధుల ఆరోపణలను ఎదుర్కొంటోంది. రాజకీయ పార్టీలు పాకిస్థాన్‌లో విదేశాల నుంచి విరాళాలు సేకరించలేవు. అలా చేస్తే పార్టీలను నిషేధించవచ్చు.

Imran Khan No Confidence Vote : స్పీకర్ అవిశ్వాస తీర్మాణాన్ని తిరస్కరించిన తర్వాత జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేయాలంటూ ప్ర‌ధాని ఇమ్రాన్ సిఫార్సు చేసిన కేవ‌లం 30 నిమిషాల్లోనే రాష్ట్ర‌ప‌తి ర‌ద్దు చేశారు. అయితే దీనిపై విపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా...పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని,ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ దానిపై ఓటింగ్ జరుగనుంది.

ఇంకా చదవండి ...

Pakistan Political Crisis :పాకిస్తాన్ లో కొద్ది రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నాయి. విదేశీ కుట్ర పేరుతో చట్టసభ రద్దుకు సాహసించిన ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఉదయం 10.30 గంటలకు పాక్ నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్)లో ఓటింగ్‌ జరగనుంది. మిత్రపక్షాలు సహా సొంత పార్టీ సభ్యులు కూడా దూరం కావడం వల్ల ఇమ్రాన్‌ ప్రభుత్వ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అయితే అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్‌ కు ముందే ఇమ్రాన్‌ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 342 స్ధానాలున్న పాక్‌ పార్లమెంట్ లో మెజార్టీకి 172 ఓట్లు అవసరం. మిత్రపక్షాలు దూరం కావడం సహా, సొంత పార్టీకి చెందిన సభ్యులు కూడా దూరం కావడంతో ఇమ్రాన్‌ సర్కార్‌ మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే విశ్వాస పరీక్ష ద్వారా పదవి కోల్పోయిన తొలి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ అవుతారు. కాగా,గ‌తంలో రెండు సార్లు పాకిస్తాన్ ప్ర‌ధానుల‌పై అవిశ్వాస తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. కానీ అవి వీగిపోయాయి.

తొలుత 1989లో బెన‌ర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌గా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్ర‌ధాని షౌకాత్‌ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు. విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొన్న ప్ర‌ధానుల్లో ఇమ్రాన్‌ ఖాన్ మూడో వ్య‌క్తి అవుతారు. అయితే పాకిస్తాన్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఏ ప్ర‌ధాని కూడా పూర్తి కాలం ప‌ద‌విలో కొన‌సాగ‌లేదు. అటు ఇమ్రాన్‌ ప్రభుత్వ ఓటమి ఖాయం కావడం వల్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు యత్నాలు మొదలుపెట్టాయి. కొత్త ప్రధానిగా విపక్షాలు బలపరుస్తున్న పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణం చేసే అవకాశం ఉంది.

ALSO READ Sri Lanka Crisis : అమ్మో.. కప్పు టీ 100 రూపాయలా.. లీటర్ పాలు రూ.2 వేలు.. చావలేక బతుకుతున్న ప్రజలు..

కాగా,ఈ నెల 3వ తేదీన పాక్ పార్లమెంట్ సెషన్ లో స్పీకర్ స్థానంలో కూర్చొని సభను నడిపిన డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి..ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరపకుండా..ఇది విదేశీ కుట్ర అని పేర్కొంటూ ఆ తీర్మానాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. స్పీకర్ అవిశ్వాస తీర్మాణాన్ని తిరస్కరించిన తర్వాత జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేయాలంటూ ప్ర‌ధాని ఇమ్రాన్ సిఫార్సు చేసిన కేవ‌లం 30 నిమిషాల్లోనే రాష్ట్ర‌ప‌తి ర‌ద్దు చేశారు. అయితే దీనిపై విపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా...పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని,ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ దానిపై ఓటింగ్ జరుగనుంది.

ఇక,అవిశ్వాస తీర్మాణాన్ని ఎదర్కోడానికి కొన్ని గంటల ముందు శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కోర్టు నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ కుట్ర అంశాన్ని కోర్టు ఎందుకు చూడలేదో అని అన్నారు. కోర్టు సాక్ష్యాధారాలను చూసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. హిందుస్థాన్‌ పేరును ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. భారత్‌లో తనకు ఎంతో గౌరవం వచ్చిందని అన్నారు. భారత్‌ను (India) నిస్వార్థ దేశంగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. ఇండియా స్వతంత్ర విదేశాంగ విధానం ఎంతో గొప్పదని.. భారత్‌పై కుట్ర చేయడానికి ఎవరూ సాహసించరని అన్నారు. ప్రపంచంలో భారతదేశానికి ఎంతో గౌరవం ఉందని కొనియాడారు. కానీ పాకిస్థాన్ (Pakistan) ఒక బానిస దేశమని కామెంట్ చేశారు

First published:

Tags: Imran khan, Pakistan

ఉత్తమ కథలు