ప్రధాని మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ

ఇరు దేశాల మధ్య 2016లో నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించాలని భారత ప్రధాని మోదీని ఇమ్రాన్ ఖాన్ తన లేఖలో కోరారు.

news18-telugu
Updated: September 20, 2018, 4:09 PM IST
ప్రధాని మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (File photo/AP)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించాలని ఆ లేఖలో కోరారు. ఈ నెలాఖర్లో న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, షా మెహ్మూద్ ఖురేషీల మధ్య భేటీ జరగాలని ఆకాంక్షించారు. శాంతి చర్చల పునరుద్ధరణకు ప్రతిపాదిస్తూ ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

గత నెల 18న పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్‌కు అదే నెల 20న మోదీ లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్‌ను అభినందించారు. అయితే, ఆ లేఖలో రెండు దేశాల మధ్య చర్చలను పునరుద్ధరించాలని మోదీ కోరినట్టు పాక్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. దీనిపై అప్పట్లో దుమారం రేగింది. మోదీ కేవలం ఇమ్రాన్ ఖాన్‌ను అభినందించడానికే లేఖ రాశారని.. అందులో ఎలాంటి చర్చల ప్రస్తావన చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం  చేసింది. అయితే, అప్పుడు మోదీ రాసిన లేఖకు ఇప్పుడు పాక్ ప్రధాని ప్రత్యుత్తరం రాశారు..


ఆగస్టు మాసంలో పాక్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత శాంతి చర్చల కోసం పాక్ నుంచి అధికారికంగా ప్రతిపాదన రావడం ఇదే తొలిసారి. చివరగా 2015లో పాకిస్థాన్‌లో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్...ఆ దేశ ప్రతినిధులతో శాంతి చర్చలు జరిపారు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిచర్చలు నిలిచిపోయాయి. శాంతిచర్చలు, తీవ్రవాదం ఒకేసారి ముందుకు సాగలేవని భారత్ స్పష్టంచేసింది.
Published by: Janardhan V
First published: September 20, 2018, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading