పాకిస్థాన్‌లో ఘనంగా హోలీ.... హిందువులకు శుభాకాంక్షలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్

హోలీ సందర్భంగా పాక్‌లో ఉన్న హిందువులందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. మా దేశంలో ఉన్న హిందువులంతా సుఖ: సంతోషాలతో హోలీ పండగ చేసుకోవాలన్నారు.

news18-telugu
Updated: March 21, 2019, 8:23 AM IST
పాకిస్థాన్‌లో ఘనంగా హోలీ.... హిందువులకు శుభాకాంక్షలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • Share this:
భారత్‌తో పాటు పొరుగుదేశం పాకిస్థాన్‌లో కూడా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్న హిందువులంతా హోలీ వేడుకల అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చలికాలం ముగిసి ఎండలు మొదలైన వేళ హోలీ పండగను నిర్వహించుకుంటారు. హోలీని రంగుల పండగ్గా, ప్రేమకు ప్రతిరూపమైన పండగ్గా కూడా చేసుకుంటారు. అయితే హోలీ సందర్భంగా పాక్‌లో ఉన్న హిందువులందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. మా దేశంలో ఉన్న హిందువులందరికీ హోలీ శుభాకాంక్షలు అన్నారు. ఆయనతో పాటు మాజీ ప్రధాని బెన్‌జీర్ భుట్టో కుమారుడు , పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (ppp) ఛైర్ పర్సన్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరిమణులందరికీ హోలీ శుభాకాంక్షలు అన్నారు. హోలీ ద్వారా శాంతి, సంతోషాలకు సంబంధించిన సందేశాల్ని అందివ్వాలని పిలుపునిచ్చారు. ట్విట్టర్‌లో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఇక వారితో పటు పాకిస్థాన్ ముస్లీం లీగ్ నవాజ్ లీడర్ షెహబాజ్ షరీఫ్ కూడా హోలీ విషెస్ చేస్తూ ట్వీట్ చేశారు. అంతా హోలీ పండగను శాంతిగా... సంతోషాలతో జరుపుకోవాలన్నారు. పాకిస్థాన్ ఫారిన్ ఆఫీస్ అధికారి మొహమ్మద్ ఫైజల్ కూడా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్‌ మొత్తం జనాభా20 కోట్లు ఉంటే అందులో 4 శాతం హిందువులు ఉన్నారు. వీరి కూడా ప్రతీ ఏడాది హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.ఇవికూడా చదవండి:

శరీరంపై పడిన హోలీ రంగులు పోవాలంటే..ఇలా చేయండి.. 

Happy Holi 2019: హోలీ పండుగ ఎందుకు? ఆసక్తికర కథ ఇదే...

ముంబై హోలీ సంబరాల్లో ఉగ్రవాది మసూద్ అజర్... డేంజరస్ పబ్జి
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading