Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    కార్లు, గేదెలు అమ్మ‌కం.. ఇమ్రాన్ పొదుపు మంత్రం

    ప‌తనం అంచున ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు వినూత్న చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టారు ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌. నిరుప‌యోగంగా ఉన్న ల‌గ్జ‌రీ కార్ల‌తో పాటు మాజీ ప్ర‌ధాని ఇంట్లోని గేదెల‌ను కూడా అమ్మాల‌ని నిర్ణ‌యించారు.

    news18-telugu
    Updated: September 17, 2018, 6:13 PM IST
    కార్లు, గేదెలు అమ్మ‌కం.. ఇమ్రాన్ పొదుపు మంత్రం
    ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)
    • Share this:
    కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్... దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదట నిరుపయోగంగా పడి ఉన్న ఖరీదైన కార్లను వేలం వేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం దగ్గర 102 లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో 34 కార్లను ఇప్పటికే వేలం వేశారు. ఈ ప్రక్రియను ఇక ముందు కూడా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. రెండో దశలో 41 లగ్జరీ కార్లను వేలం వేస్తామని ప్రకటించారు.

    నిరుపయోగంగా ఉన్న నాలుగు హెలికాప్టర్లను కూడా వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్లు, విమానాలు మాత్రమే కాదు... మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేసిన ఎనిమిది గేదెలకు కూడా వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. నిరుపయోగంగా ఉన్న ప్రధాని అధికారిక నివాసాలను సైతం వేలం వేయబోతున్నారు. పాకిస్థాన్ అప్పులు 30 ట్రిలియన్లుగా ఉంది. దేశ జీడీపీలో ఇది 87 శాతం. ఐదేళ్ల క్రితం 16.4 ట్రిలియన్లుగా ఉన్న అప్పు తాజాగా 30 ట్రిలియన్లకు చేరువైందని పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ ప్రకటించిన తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.

    మినీ బడ్జెట్ పై ఆసక్తి
    దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ మొదట పొదుపు చర్యలు శ్రీకారం చుట్టారు. అయితే ఈ క్రమంలో ఆయన తీసుకోబోయే కీలకమైన నిర్ణయాలు ఏంటనే అంశంపై ప్రజలు, ఆర్థిక వేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటున్న పొదుపు చర్యలు కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమే అని... ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మినీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో...ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.
    Published by: Kishore Akkaladevi
    First published: September 17, 2018, 6:08 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading