Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    పీకల్లోతు వివాదంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు!

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధు...పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్‌కు పక్కనే ఆశీనుడు కావడం వివాదాస్పదం అవుతోంది.

    news18-telugu
    Updated: August 18, 2018, 3:32 PM IST
    పీకల్లోతు వివాదంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు!
    ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కన ఆశీనులైన సిద్ధు.
    • Share this:
    ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు తయారయ్యింది వ్యవహారం. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వంటి అతివాద నేతలు వద్దని వారించినా వినకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సిద్ధు అందరి దృష్టిని ఆకర్షించారు. పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌కు సిద్ధూ కశ్మీరీ శాలువాను కానుకగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పాక్‌ మాజీ క్రికెటర్లు రమీజ్‌ రాజా, వసీం అక్రమ్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా...సిద్ధును ప్రత్యేకంగా ఆలింగనం చేసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పాక్ వచ్చినందుకు సిద్ధుకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు.

    అంత వరకు బాగానే ఉన్నా...ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సిద్ధు...పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్‌కు పక్కనే ఆశీనులు కావడంపై వివాదం రాజుకుంది. దీనిపై భారత్‌లోని పలువురు జాతీయవాదులు, నెటిజన్లు మండిపడుతున్నారు. అటు జమ్ముకశ్మీర్‌ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్ కూడా సొంత పార్టీకి చెందిన సిద్ధు తీరును తప్పుబట్టారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడి పక్కన సిద్ధు కూర్చోవాల్సింది కాదని, దీనిపై ఆయనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

    అటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ పార్టీకి చెందిన నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఈ వివాదం నుంచి సిద్ధూను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడి పక్కన కూర్చోబెట్టి సిద్ధును పాక్ ప్రభుత్వం అవమానించిందని ట్వీట్స్ చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి..
    Published by: Janardhan V
    First published: August 18, 2018, 3:22 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading