మహాత్మ గాంధీ హంతకుల సిద్ధాంతమే...కాశ్మీర్‌ను విడగొట్టింది: పాక్ ప్రధాని ఇమ్రాన్

ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. అంతేకాదు భారత్ మతతత్వ రాజ్యంగా మారుతోందని, బీజేపీ ప్రభుత్వం వర్ణ వివక్షను అమలు చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.

news18-telugu
Updated: August 6, 2019, 5:43 PM IST
మహాత్మ గాంధీ హంతకుల సిద్ధాంతమే...కాశ్మీర్‌ను విడగొట్టింది: పాక్ ప్రధాని ఇమ్రాన్
ఇమ్రాన్ ఖాన్ (File)
  • Share this:
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్‌ ఖండించింది. పాకిస్థాన్ పార్లమెంట్ వేదికగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. అంతేకాదు భారత్ మతతత్వ రాజ్యంగా మారుతోందని, బీజేపీ ప్రభుత్వం వర్ణ వివక్షను అమలు చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. తమ పోరాటం వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా జరుగుతుందని, ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అంతేకాదు, భారత్ తన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతోందని, అలాగే సుప్రీం కోర్టు, ఐక్యరాజ్య సమితి, సిమ్లా ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. జెనీవా కన్వెన్షన్‌కు వ్యతిరేకంగా జనాభా స్వరూపాన్ని మార్చడం అంటే, యుద్ధ నేరంగా భావించవచ్చని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అలాగే భారత్ లో జరగుతున్న పరిణామాలను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ నియంత హిట్లర్ తీసుకున్న నిర్ణయాల తరహాలోనే భారత్ లోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని ఇమ్రాన్ విమర్శించారు.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు