పౌరసత్వ సవరణపై విరుచుకుపడ్డ ఇమ్రాన్.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్..

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత్ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఇమ్రాన్‌కు కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: December 13, 2019, 10:32 AM IST
పౌరసత్వ సవరణపై విరుచుకుపడ్డ ఇమ్రాన్.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇమ్రాన్ ఖాన్ (File Photo)
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లుపై ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతుండగానే మరోవైపు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. చట్టరూపం దాల్చిన పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ఎలా అమలుచేయబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా వరుస ట్వీట్స్ చేశారు. భారత్‌లో అన్ని రకాల మానవ హక్కులకు ఈ చట్టం భంగం కలిగించబోతుందని, అలాగే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు ఇది విరుద్దం అని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ 'హిందూ ఆధిపత్య ఎజెండా'లో ఇదొక భాగమని ఆరోపించారు. జర్మనీలో నాజీల పాలనలో కొనసాగిన నియంతృత్వమే మోదీ పాలన తలపిస్తోందని.. ఇలాంటి విధానాలు భారీ రక్తపాతానికి,తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని అన్నారు. యుద్దానికి తెరదీయక ముందే భారత్ విషయంలో ప్రపంచ దేశాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత్ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఇమ్రాన్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. భారత అంతర్గత వ్యవహారాలపై స్పందించే బదులు.. పాకిస్తాన్‌లోని మైనారిటీల పరిస్థితిపై దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. పాక్ రాజ్యాంగంలోనే మైనారిటీల పట్ల వివక్ష ఉందన్నారు.

ఇదిలా ఉంటే,పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. అక్కడ వేలాది మంది ప్రజలు నిత్యం రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. దీంతో శాంతిభద్రతలపై ఒకింత ఆందోళన నెలకొంది.


First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు