Pakistan Petrol Price : పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. మోదీ సర్కారు పెట్రోల్ ధరలు(Petrol Prices) తగ్గించడాన్ని అభినందించారు. రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేయడం వల్లే అది సాధ్యపడిందన్నారు. అదే సమయంలో స్వదేశంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తక్కువ ధరకు పెట్రోల్ కొనుగోలుపై చర్చల కోసమే తాను గతంలో రష్యాకు వెళ్లినట్టు ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన సమయంలో ఆ దేశంలో ఇమ్రాన్ ఖాన్ పర్యటించి విమర్శలు కొని తెచ్చుకోవడం తెలిసిందే.
కాగా,దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాక్ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ దేశ ఆర్థికమంత్రి మిఫాత్ ఇస్మైల్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వరుస ట్వీట్ లు చేశారు. " దేశంలో పెట్రోల్ ధరలను ప్రభుత్వం ఒకేసారి 20శాతం/రూ.30 పెంచింది. ఒకేసారి ఈ స్థాయిలో ధరలు పెంచడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు అమెరికా వ్యూహాత్మక మిత్రదేశమైన భారతదేశం.. రష్యా నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడం ద్వారా ఇంధన ధరలను లీటరుకురూ. 25 చొప్పున తగ్గించగలిగింది. ఇప్పుడు మన దేశం ఈ మోసగాళ్ల చేతిలో మరో భారీ ద్రవ్యోల్బణాన్ని చవిచూస్తుంది"అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ALSO READ Leaked Video : కాక్ పిట్ లో కామకేళి..ఎక్కువ సేపు శిక్షణ ఆశ చూపి ట్రైనీ పైలట్ తో శృంగారం
కాగా,పాకిస్తాన్ లోఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు దేశానికి ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్ చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజలపై ఈ భారం వేయకతప్పట్లేదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ హయాంలోపెట్రోల్ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ అమలులోకి వచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్ తేల్చిచెప్పడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడుపాకిస్తాన్ లో పెట్రోల్ లీటరు ధర రూ.179.85, డీజిల్ లీటరు రూ.174.15, కిరోసిన్ రూ.155.95, లైట్ డీజిల్ రూ.148.41కు చేరాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Oil prices, Pakistan