హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ఖతం -గద్దె దించనున్న ఆర్మీ -కారణాలివే -pakistan కొత్త ప్రధాని ఎవరంటే

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ఖతం -గద్దె దించనున్న ఆర్మీ -కారణాలివే -pakistan కొత్త ప్రధాని ఎవరంటే

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని ఇన్నింగ్స్ దాదాపు ముగిసిపోనుంది. పాక్ ఆర్మీ చీఫ్ సూచనల మేరకు ఇమ్రాన్ సంకీర్ణయ ప్రభుత్వం నుంచి ముతైహిదా ఖౌమీ మూమెంట్(ఎంక్యూఎం), పాకిస్తాన్ ముస్లీం లీగ్(పీఎంఎల్-క్యూ) పార్టీలు వైదొలగనున్నాయి. ఐఎస్ఐ కొత్త చీఫ్ ఎంపికలోనూ ప్రధానికి ఆర్మీ చీఫ్ చెక్ పెట్టారు. ఇమ్రాన్ రాజీనామా చేయకుంటే సైనిక తిరుగుబాటుకు సైతం వెనుకాడబోమని బజ్వా సంకేతాలిస్తున్నారు..

ఇంకా చదవండి ...

పొరుగు దేశం పాకిస్తాన్(Pakistan) లో మరోసారి రాజకీయ-సైనిక సంచలనాలకు తెరలేచింది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇన్నింగ్స్‌ను ఖతంపట్టించే దిశగా పాక్ ఆర్మీ దూకుడు పెంచింది. కొంత కాలంగా ప్రధాని తీరుపై గుర్రుగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా.. దేశ ప్రధానిని మార్చేందుకు కీలక వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా, ఇమ్రాన్ నాయకుడిగా ఉన్న పీటీఐ సంకీర్ణ ప్రభుత్వం నుంచి మిత్రపక్షాలు వైదొలిగేలా చేయడం ద్వారా చట్టబద్దంగానే ప్రధానిని మార్చడం లేదంటే సైనిక తిరుబాటు చేయడమనే నిర్ణయానికి ఆర్మీ చీఫ్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కొత్త ప్రధానిగా ఎవరుండాలనేదానిపైనా కసరత్తుచేసిన ఆర్మీ చీఫ్ రెండు పేర్లను సిద్దం చేసినట్లు సమాచారం. పాక్ లో కొద్ది రోజులుగా ప్రధాని వర్సెస్ ఆర్మీ చీఫ్ అన్నట్లుగా సాగుతోన్న పోరులో ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కొత్త చీఫ్ ఎంపిక వ్యవహారం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఇండియాను కూడా ప్రభావితం చేయగల పాక్ తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనమిది..

ఇమ్రాన్ ముందు రెండే దారులు

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని ఇన్నింగ్స్ దాదాపు ముగిసిపోనుంది. ఆయన చైర్మన్ గా ఉన్న పీటీఐ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి ముతైహిదా ఖౌమీ మూమెంట్(ఎంక్యూఎం), పాకిస్తాన్ ముస్లీం లీగ్(పీఎంఎల్-క్యూ) పార్టీలు రెండూ వైదొలగానికి సిద్ధంమయ్యాయి. పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా సూచనల మేరకే ఆ రెండు పార్టీలు ఇమ్రాన్ కు మద్దతు ఉపసంహరించుకోడానికి రెడీ అయ్యాయి. ముందుగా ప్రధానిని తొలగించే ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ చీఫ్ అది వీలుకాకపోతే ఏకంగా ప్రభుత్వాన్నే కూలదోసి సైనిక పాలనకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్.. ప్రధాని ఇమ్రాన్ ముందు రెండు ఆప్షన్లను ఉంచించారట. మొదటిది నవంబర్ 20లోగా ఇమ్రాన్ తనంతట తానే మర్యాదగా రాజీనామా చేయాలి. లేదా, ఇమ్రాన్ అభిశంసనకు పార్లమెంటు వేదికవుతుందనేది రెండో ఆప్షన్. ఎలా చూసినా ఇమ్రాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి. నవంబర్ 20నే డెడ్ లైన్ గా నిర్ధారించడానికి కూడా బలమైన కారణముంది. నిజానికి ప్రధాని మార్పులో ఇప్పుడు చెప్పుకోబోయే పాయింటే అత్యంత కీలకమైనది..

Etela Rajender ఆ పని చేయగలరా? -cm kcrకు షాకిచ్చేలా bjp సరికొత్త వ్యూహం ఇదే..


ఐఎస్ఐ చీఫ్ ఎంపికపై వివాదం

పాకిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాలు ఎన్నొచ్చినా, ప్రధానులు ఎందరు మారినా వ్యవహారం మొత్తం ఆర్మీ చెప్పినట్లే జరుగుతుందన్నది కాదనలేని వాస్తవం. ప్రభుత్వానికి, ఆర్మీకి అత్యంత కీలకమైన మరో వ్యవస్థే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ). సాధారణంగా ఆర్మీలో పనిచేస్తోన్న కీలక అధికారుల్నే ఐఎస్ఐ చీఫ్ లుగా నియమిస్తుంటారు. అయితే ఆ పదవిలో ఎవరుండాలనేది విషయంలో ప్రధాని నిర్ణయం కంటే కూడా ఆర్మీ చీఫ్ ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఐఎస్ఐకి కొత్త డైరెక్టర్ జనరల్(డీజీ)గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ ఈనెల 20న బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్లినెంట్ జనరల్ ఫయీద్ హమీద్ మాత్రం పదవి నుంచి దిగిపోవడానికి ఇష్టపడటంలేదు. పెషావర్ కార్ప్స్ కమాండ్ కూడా అయిన ప్రస్తుత ఐసిస్ చీఫ్ హమీద్ కు ప్రధాని ఇమ్రాన్ వత్తాసు పలుకుతుండటం, అవసరమైతే ఆర్మీ చీఫ్ కు వ్యతిరేకంగా తన కమాండ్ ను కూడా ఇమ్రాన్ కు మద్దతుగా దించాలని హమీద్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదీగాక,

hyderabad : హీరోయిన్ చౌరాసియాపై దాడి -గాయాలతో 100కు ఫోన్.. కేబీఆర్ పార్క్‌లో షాకింగ్ ఘటన


ఇండియాను దెబ్బతీసేలా తాలిబన్ గానం

తాలిబన్ ఏలుబడిలోని అఫ్గానిస్తాన్ తో మరింత దోస్తీ పెంచుకోవడం ద్వారా ఇండియాను దెబ్బతీయొచ్చని ఇమ్రాన్ భావిస్తుండగా, ఆ ఆలోచనలను ప్రస్తుత ఐసిస్ చీఫ్ హమీద్ సమర్థిస్తున్నాడని, ఆర్మీ చీఫ్ బజ్వాకు మాత్రం ఇది ఏమాత్రం నచ్చడం లేదని, ఇండియాను దెబ్బతీయడానికి కావాల్సినన్ని మార్గాలుండగా తాలిబన్లతో కలవడం అవసరమేలేదని, తాలిబన్లకు ఇంకా దగ్గరైతే వారి విషపు కోరలకు పాకిస్తాన్ బలికావాల్సి వస్తుందని బజ్వా భావిస్తున్నారని, అందుకే హమీద్ ను తొలగించి ఐఎస్ఐకి కొత్త చీఫ్ గా నదీమ్ అంజుమ్ ను నియమించారని విశ్వసనీయ వర్గాలు చెబతున్నాయి. ఐఎస్ఐకి కొత్త చీఫ్ నియామకం కంటే ముందు..

etela rajender గేమ్ స్టార్ట్ -cm kcrపై అనూహ్య దాడి -bjpలో ఉన్నా మారని నైజం


పాక్ కొత్త ప్రధానిగా ఇద్దరి పేర్లు

ఇమ్రాన్ ను ప్రధాని పదవి నుంచి దించేసే వ్యూహాల్లో భాగంగా ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా చేసిన మరో పని తెహ్రీక్ ఏ లబాయిక్ పాకిస్తాన్(టీఎల్పీ) ఉద్యమానికి అండగా నిలవడటం. ఉగ్రవాద మూలాల కట్టడి పేరుతో ఇమ్రాన్ ఖాన్ సర్కారు పెద్ద ఎత్తున అరెస్టులకు పాల్పడగా, జైలుపాలైన తమ వారిని విడిపించుకునేందుకు టీఎల్పీ కొద్ది నెలలుగా భారీ ఉద్యమం చేస్తున్నది. చాలా సార్లు హింసాత్మకంగా మారిన ఆ ఉద్యమంలో ఇప్పటికే చాలా మంది అమాయక ప్రజలు బలైపోయారు. టీఎల్పీ హింస పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రధాని ఇమ్రాన్ ఇటీవలే టీఎల్పీ ముఖ్యనేత సాద్ రిజ్వీని జైలు నుంచి విడుదల చేశారు. ఇమ్రాన్ కు ఏ మాత్రం అవకాశం దక్కనీయకుండా ఇటు రాజకీయ పార్టీలను, అటు ఐఎస్ఐని పూర్తిగా కంట్రోల్ చేస్తోన్న ఆర్మీ చీఫ్ బజ్వా.. తదుపరి ప్రధానులను ఎంపిన చేసే పనిలోనూ ఉన్నారట. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగినప్పటికీ పార్లమెంటులో బలాబలాల రీత్యా పీటీఐ పెద్ద పార్టీగానే ఉంటుంది కనుక ఆ పార్టీకే చెందిన పర్వేజ్ ఖట్టక్ ను లేదంటే పాకిస్తాన్ ముస్లీం లీగ్(నవాజ్) పార్టీకి చెందిన షహబాజ్ షరీఫ్ ను ప్రధాని సీటులో కూర్చోబెట్టాలని ఆర్మీ చీఫ్ భావిస్తున్లట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా రాబోయే ఒకటి రెండు వారాల్లో పాక్ రాజకీయాల్లో సంచలనాలు ఖాయమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

First published:

Tags: Imran khan, Pakistan, Pakistan army

ఉత్తమ కథలు