లక్ష కోట్లు ఇవ్వండి... ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు

ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరపడ్డ పాకిస్థానీయులు తలో వెయ్యి డాలర్లు విరాళం ఇస్తే... దేశంలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవచ్చని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ప్రజలు ఇచ్చే డబ్బు దుర్వినియోగం కాకుండా కాపాడే పూర్తి బాధ్యత తనదే అని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: September 28, 2018, 5:51 PM IST
లక్ష కోట్లు ఇవ్వండి... ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (File photo/AP)
  • Share this:
లక్ష కోట్ల రూపాయలు. అక్షరాల లక్ష కోట్ల రూపాయలు ప్రజల నుంచి విరాళాలుగా సేకరించాలని పాకిస్థాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. వినడానికి ఇది కాస్త విడ్డూరంగానే ఉన్నా... ఆయన మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్ ప్రభుత్వం దగ్గర నిరుపయోగంగా ఉన్న లగ్జరీ కార్లను వేలం వేయాలని నిర్ణయం తీసుకుని అమలు చేసిన ఇమ్రాన్ ఖాన్... తాజాగా పాకిస్థాన్ లోని నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డ పాకిస్థాన్ వాసుల నుంచి ఏకంగా లక్ష కోట్లు విరాళాల రూపంలో సేకరించాలని నిర్ణయించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరపడ్డ పాకిస్థానీయులు తలో వెయ్యి డాలర్లు విరాళం ఇస్తే... దేశంలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవచ్చని ఇమ్రాన్ తెలిపారు. ప్రస్తుతం కొత్త నీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు కావాల్సిన నిధులు పాకిస్థాన్ దగ్గర లేవు. ఇప్పటికే ఉన్న అప్పులపై వడ్డీలను చెల్లించేందుకే ఆ దేశం ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ సరికొత్త మార్గంలో విరాళాలు సేకరించాలని అన్నారు. ప్రజలు ఇచ్చే డబ్బు దుర్వినియోగం కాకుండా కాపాడే పూర్తి బాధ్యత తనదే అని ఇమ్రాన్ అన్నారు. అయితే ప్రజల నుంచి లక్ష కోట్లు సేకరించడం సాధ్యమయ్యే పనికాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి ప్రాజెక్టుల కోసం ఈ తరహాలో నిధులు సేకరించిన దాఖలాలు ఎక్కడా లేవని అంటున్నారు.

మరోవైపు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలకు, చేతలకు పొంతన లేదనే వాదన కూడా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం పొదుపు మంత్రం అంటూ ప్రకటనలు చేసిన ఇమ్రాన్ ఖాన్... విదేశీ పర్యటన కోసం చార్టెడ్ విమానాలను ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన లక్ష కోట్ల విరాళాల ప్రకటనకు ఏ రకమైన స్పందన వస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: September 28, 2018, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading