ఇమ్రాన్‌ఖాన్ కేబినెట్ సభ్యులు వీరే..!

పాకిస్థాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. 16మంది మంత్రులు కాగా.. మిగతా ఐదుగురు పాక్ ప్రధానికి సలహాదారులుగా వ్యవహరించనున్నారు.

news18-telugu
Updated: August 19, 2018, 2:57 PM IST
ఇమ్రాన్‌ఖాన్ కేబినెట్ సభ్యులు వీరే..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్థాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. 16మంది మంత్రులు కాగా.. మిగతా ఐదుగురు పాక్ ప్రధానికి సలహాదారులుగా వ్యవహరించనున్నారు. అయితే.. వీరిలో 12మంది గతంలో పాక్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాలనలో మంత్రులుగా పనిచేసినవారే కావడం విశేషం.
కొత్త కేబినెట్‌లో పాక్ విదేశాంగ మంత్రిగా షా మహమూద్ ఖురేషీ, రక్షణ మంత్రిగా పర్వేజ్ ఖట్టక్, ఆర్థికమంత్రిగా అసద్ ఉమర్‌లు వ్యవహరించనున్నారు. అసద్ ఉమర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఉమర్ కుమారుడైన ఖురేషీ గతంలో పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ప్రభుత్వంలో 2008 నుంచి 2011 విదేశాంగ మంత్రిగా పనిచేశారు. కొత్త కేబినేట్ రేపు కొలువుదీరనుంది.
Published by: Amala Ravula
First published: August 19, 2018, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading