Imran Khan: పాకిస్థాన్‌లో అత్యాచారాలకు మహిళల వస్త్రధారణే కారణం.. ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో లైంగిక వేధింపుల కేసుల పెరుగుదలకు మహిళల దుస్తులు, వస్త్రధారణే కారణమని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో లైంగిక వేధింపుల కేసుల పెరుగుదలకు మహిళల దుస్తులు, వస్త్రధారణే కారణమని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత వస్తోంది. ‘మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే, ఆ ప్రభావం పురుషులపై పడుతుంది. మగవాళ్లు రోబోలు కాదు కదా. ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం’ అని ఇమ్రాన్ చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

పాకిస్థాన్‌లో అత్యాచారాలకు, వస్త్రధారణకు ముడిపెట్టడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్, దక్షిణ ఆసియా న్యాయ సలహాదారు రీమా ఒమర్. లైంగిక హింస విషయంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ బాధితులపై నిందలు వేయడం బాధాకరమని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఇమ్రాన్ వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతున్నారు ఆయన డిజిటల్ మీడియా విభాగం ప్రతినిధి డాక్టర్ అర్స్లాన్ ఖలీద్.

ఇమ్రాన్ మాటల్లో కొంత భాగాన్ని మాత్రమే చూడటం సరికాదన్నారు. మనం జీవిస్తున్న సమాజంలో లైంగిక వాంఛల ప్రభావం గురించి ఇమ్రాన్ మాట్లాడారని, అందులో ఒక వాక్యాన్ని తీసుకొని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అర్స్లాన్ ఖలీద్ ట్వీట్ చేశారు. గతంలోనూ ఇమ్రాన్ ఇలాంటి మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్‌లో లైంగిక హింస కేసులు పెరగడానికి అసభ్యత కారణమని ఈ ఏప్రిల్‌లో సైతం ఇమ్రాన్ చెప్పారు. దీంతో దీనిపై క్షమాపణలు చెప్పాలని వందలాదిమంది ఒక స్టేట్‌మెంట్‌పై సంతకం చేసి, డిమాండ్‌ చేశారు.

ఇంటర్య్యూలో ఏం చెప్పారంటే..
ఒక లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కొన్ని అంశాలను ప్రస్తావించారు. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల నివారణపై తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మహిళలు ముసుగు (పరదా) ధరించాల్సిన అవసరం గురించి ఇమ్రాన్ చెప్పారు. ఈ క్రమంలో పొట్టి దుస్తులు మగవాళ్లను రెచ్చగొడతాయనే అర్థం వచ్చేలా మాట్లాడారు.https://twitter.com/reema_omer/status/1406740654835879943?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1406740654835879943%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Fworld%2Fstory%2Fimran-khan-again-blames-women-s-clothing-for-rapes-in-pakistan-1817415-2021-06-21

నేరారోపణ రేటు 0.3 శాతం మాత్రమే
పాకిస్థాన్‌లో ప్రతి 24 గంటలకు కనీసం 11 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశంలో గత ఆరేళ్లలో 22,000 అత్యాచార కేసులు నమోదయ్యాయి. కానీ ఈ కేసుల్లో దోషులకు శిక్ష విధించే రేటు 0.3 శాతంగానే ఉంది. మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ఆర్డినెన్స్‌ను పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి గతేడాది ఆమోదించారు. ఇలాంటి కేసుల్లో చట్టపరమైన విచారణ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఈ చట్టం చెబుతోంది.
Published by:Krishna Adithya
First published: